ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో సస్పెన్షన్ల ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయినప్పటినుంచి టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేస్తూనే ఉన్నారు. తాజాగా అసెంబ్లీలో అమల్లోకి వచ్చింది రెడ్ లైన్ నిబంధన. స్పీకర్ పోడియం చుట్టూ రెడ్ లైన్ ఏర్సాటు చేశారు. గీత దాటి పోడియంలోకి జొరబడే ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్ గా సస్పెన్షన్ అవుతారు. ఈ మేరకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. రెడ్ లైన్ ఇవతల నిలబడి నినాదాలు చేశారు టీడీపీ ఎమ్మెల్యేలు. ప్రశ్నోత్తరాల సమయంలో ఇలాగే కొనసాగింది. సభ ప్రారంభం కాగానే తాము ఇచ్చిన వాయిదా తీర్మానం పై చర్చ కు పట్టుబట్టారు టీడీపీ సభ్యులు. జీవో నెంబర్ 1 పై వాయిదా తీర్మానం పై చర్చకు పట్టుబట్టారు టీడీపీ సభ్యులు.
Read Also: Viral Crocodile : వామ్మో వీడి ధైర్యం తగలెయ్యా.. మొసలినే మోసుకెళ్తున్నాడు
స్పీకర్ రూలింగ్ కు వ్యతిరేకంగా రెడ్ లైన్ దాటి వచ్చారు టీడీపీ ఎమ్మెల్యేలు. దీంతో ఆటోమేటిక్ సస్పెన్షన్ వర్తించిందని స్పష్టం చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. రెడ్ లైన్ దాటవద్దని స్పీకర్ హెచ్చరించినా టీడీపీ సభ్యులు పట్టించుకోలేదు. అయినా పోడియం ఎక్కిన టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 11 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం ప్రకటించారు స్పీకర్ తమ్మినేని సీతారాం. ఇవాళ వెలగపూడి రామకృష్ణ, బెందాళం అశోక్, గద్దె రామ్మోహన్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అచ్చెన్నాయుడు, గొట్టిపాటి, నిమ్మకాయల, ఏలూరి సాంబశివరావు, చినరాజప్ప, డోల స్వామి, మంతెన రామరాజులను సభనుంచి సస్పెండ్ చేశారు.
Read Also: Ap Legislative Council: శాసనమండలిలో మారనున్న బలాబలాలు