పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనించాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తనపై, తన కుటుంబ సభ్యులపై చేస్తున్న ట్రోలింగ్స్‌పై తాను వెళ్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశానన్నారు. వైఎస్ జగన్‌పై నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలతో వైసీపీ శ్రేణుల మనోభావాలు దెబ్బ తింటున్నాయన్నారు.
మరోసారి ఎమ్మెల్యేలకు సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అసెంబ్లీలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వర్క్ షాప్ నిర్వహించారు... అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ వంటి అవకాశాలపై ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించడానికి ఈ వర్క్ షాప్ నిర్వహించారు.. తొలిసారి ఎమ్మెల్యేలైన వారికి ఈ వర్క్ షాప్ లో మరింత ప్రాధాన్యత కల్పించారు... బడ్జెట్ పై పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సంస్థ ప్రతినిధులు ప్రజెంటేషన్ ఇచ్చారు.. అయితే, బడ్జెట్ సమావేశాలపై…
వైఎస్ జగన్ అసెంబ్లీకి రాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.. అయితే, ఈ నెల 22వ తేదీ వరకూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తాం.. అసెంబ్లీ సమావేశాలు సీరియస్ గా జరగాలి అన్నారు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు
విశాఖ డెయిరీ యాజమాన్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు... అయితే, విశాఖ డెయిరీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు వైసీపీ నేత అడారి ఆనంద్ కుమార్.. గత ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆనంద్.. అయితే, విశాఖ డెయిరీపై సంచలన వ్యాఖ్యలు చేశారు స్పీకర్.. రైతుల సొమ్ములతో డెయిరీ పాలకవర్గం సోకులు చేస్తోంది.. అవసరమైతే చైర్మన్ ను జైలుకు ఈడుస్తాం అని హెచ్చరించారు..
అనకాపల్లి ఏరియా ఆస్పత్రే నా మానస పుత్రిక.. దీనిని చెడగొట్టేందుకు ప్రయత్నం చేస్తే సహించేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు.. కలెక్టర్ విజయకృష్ణన్ ఆధ్వర్యంలో ఏరియా ఆస్పత్రిలో నిర్వహించిన సమీక్ష మాట్లాడిన ఆయన.. భావోద్వేగానికి గురయ్యారు..
జగన్ కాని.. వైసీపీ ఎమ్మెల్యే లు కానీ.. మీడియాలో మాట్లాడటం కాదు.. అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సూచించారు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోరితే సభాపతిగా తాను తప్పకుండా మాట్లాడే అవకాశం ఇస్తానన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.. 16వ శాసన సభ మొదటి సమావేశాలను నిరవధికంగా వాయిదా వేశారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు.. ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. మొత్తం 27 గంటల 28 నిముషాల పాటు సభ కార్యక్రమాలు జరిగాయని వెల్లడించారు.. శాసన సభలో సభ్యులు 36 ప్రశ్నలు ప్రభుత్వానికి సంధించారని.. అందులో స్వల్ప వ్యవధి ప్రశ్న ఒకటిగా పేర్కొన్నారు..