స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆహ్వానం మేరకు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ నర్సీపట్నం వెళ్తున్నారు అని.. పోలీసులు ఇప్పుడు అనుమతి లేదు అంటే స్పీకర్ అంటే గౌరవం లేదా? అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. స్పీకర్‌కి మెడికల్ కాలేజీ కనిపించడం లేదని, జగన్ వెళ్లి చూపిస్తారని విమర్శించారు. మెడికల్ కాలేజీకి సంబంధించిన జీవోను, నిర్మాణాలను, పనులు ఆపివేయాలని ప్రభుత్వం ఇచ్చిన జీవో కూడా చూపిస్తామని తెలిపారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ తప్పు…
Amaravati: అసెంబ్లీ ఆవరణలోని నూతన భవనాన్ని ప్రారంభించారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు.. ఈ సందర్భంగా నూతన అసెంబ్లీ భవన నిర్మాణాన్ని కూడా త్వరలోనే ప్రారంభించనున్నట్టు వెల్లడించారు.. అసెంబ్లీ ఆవరణలో రూ.3.55 కోట్లతో ఈ భవనం నిర్మాణం చేశాం. మొదటి ఫ్లోర్ లో విప్ లకు కేటాయించాం.. మీడియా పాయింట్ కూడా ఏర్పాటు చేస్తాం అన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు.. ఈ భవనాన్ని ప్రారంభించడం మా అందరికీ…
Off The Record: నా బంగారం… అసెంబ్లీలో కొరమీనంత మైకట్టుకోని అధ్యచ్చా…. అంటుంటే దాన్ని నేను టీవీలో చూసి మురిసిపోవాల. ఓ పాపులర్ సినిమాలో విలన్ డైలాగ్ ఇది. సినిమా కాబట్టి విలన్ నోట్లో నుంచి ఆ డైలాగ్ వచ్చినా… బయట చాలామంది పొలిటికల్ హీరోల డ్రీమ్ ఇది. సినిమాలో భార్యను ఉద్దేశించి విలన్ అన్నా… నిజ జీవితంలో మాత్రం ఎవరికి వాళ్ళు ఎమ్మెల్యేలై పోవాలని కలలుగంటుంటారు. అధ్యక్షా అన్న మూడక్షరాలు పలకడానికి కొందరు నాయకులకు జీవితకాలం…
ఉద్యోగులు డ్యూటీకి వెళ్లకపోతే జీతం కట్ చేస్తారు.. మరి, ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు ఇవ్వాలి..? అని ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు..
సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. వైఎస్ జగన్, ఆయన ఎమ్మెల్యేలు సభకు వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని సూచించారు.. అంతేకాదు, సభాపతిగా ఎమ్మెల్యేలందరికీ సమాన అవకాశం కల్పిస్తానని పేర్కొన్నారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అసెంబ్లీకి వస్తారా..? రారా? క్లారిటీ ఇవ్వండి.. మీ మూలంగా ప్రశ్నలు మురిగిపోతున్నాయని మండిపడ్డారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. ప్రజాస్వామ్యం గురించి ఇప్పుడు మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి.. ముందు ఆ పార్టీ సభ్యులు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో చెప్పాలని నిలదీశారు.. ప్రజాస్వామ్య దేవాలయంకు ఆయన ఇచ్చే గౌరవం ఇదేనా? ఆ సభ్యులు ఇచ్చే గౌరవం ఇంతేనా? అంటూ ఫైర్ అయ్యారు..
నష్ట పోయిన రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత అందరిపై ఉందని సూచించారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. చాలా మంది కొత్త సభ్యులు ఉన్నారు.. దాంతో పాటు.. ఇప్పటికే ఎన్నో బడ్జెట్‌లను సూచిన సభ్యులు కూడా ఉన్నారని తెలిపిన ఆయన.. బడ్జెట్ ను అందరూ చదవాలి.. బడ్జెట్ పత్రాలను అన్ని పెన్ డ్రైవ్ లో ఇస్తాం. సభ్యులు వాట్సాఅప్ గ్రూప్ లో పెట్టుకోవాలి. నియోజకవర్గ పరిధిలో సరళ మైన భాషతో బడ్జెట్‌పై చెప్పాలని సూచించారు..
ఎల్లుండి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.. 2025-26 బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు.. ఎల్లుండి ఉదయం 10 గంటలకు ఉభయ సభలను (శాసనసభ, శాసనమండలి) ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు.. ఆ తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుంది..
స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మరోసారి కుండబద్దలు కొట్టారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో వున్నాను గనుక మాట్లాడకూడదు అంటే కుదరదంటున్నారు. గత ఐదేళ్లు కార్య కర్తలను ఇబ్బంది పెట్టినవాళ్లను కూటమి పార్టీలు చేర్చుకోవద్దని హితవు పలికారు.. ఇక, గంజాయి వల్ల జరిగే అనర్ధాలు, యువత ఎదుర్కోంటున్న ఇబ్బందులు చాలా తీవ్రంగా వున్నాయని అన్నారు. గంజాయి కేసుల కోసం అయితే తన ఇంటి గుమ్మం కూడా ఎక్కొద్దని స్పష్టం చేశారు.. ఇక, అనకాపల్లి నియోజకవర్గ పరిధిలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో…
అనకాపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.. రాష్ట్రవ్యాప్తంగా గత మూడు రోజులుగా దొంగ పెన్షన్లపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.. రాష్ట్రంలో మూడు లక్షల 20 వేల మంది దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారని తేలిందన్నారు.. తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారని బట్టబయలు అయ్యిందన్నారు..