Speaker Ayyanna Patrudu: విశాఖ డెయిరీ యాజమాన్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు… అయితే, విశాఖ డెయిరీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు వైసీపీ నేత అడారి ఆనంద్ కుమార్.. గత ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆనంద్.. అయితే, విశాఖ డెయిరీపై సంచలన వ్యాఖ్యలు చేశారు స్పీకర్.. రైతుల సొమ్ములతో డెయిరీ పాలకవర్గం సోకులు చేస్తోంది.. అవసరమైతే చైర్మన్ ను జైలుకు ఈడుస్తాం అని హెచ్చరించారు.. సొసైటీ ప్రెసిడెంట్లకు 4 గ్రాముల బంగారం ఇచ్చి.. సొసైటీ నుంచి రూ. 39,100ల రైతుల సొమ్ము దోచేశారు.. సొసైటీల సొమ్ముతో షీలా నగర్ లో ఆసుపత్రి ఏర్పాటు చేసి, రైతులకు నామమాత్రం చికిత్సలు అందిస్తున్నారు. రైతుల పిల్లల ఇంజనీరింగు చదువుల పేరుతో యలమంచిలిలో పాల రైతుల సొమ్ముతో స్థలం కొని, ఎవరిని సంప్రదించకుండా అమ్మేశారు… దాన్ని అమ్మకం చేసిన తులసీరావు తూర్పు గోదావరి జిల్లాలో భూమి కొన్నారు.. అది పాల రైతులదా? తులసీరావుదా? అని నిలదీశారు.
Read Also: TS High Court: దుర్గం చెరువు పరిసర వాసులకు హైకోర్టు ఊరట.. కూల్చివేతలపై స్టే..
ఈ సొమ్మంతా పాలు పోసే రైతులదే అని స్పష్టం చేశారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. వచ్చే శాసనసభ సమావేశాల్లో దీనిపై చర్చిస్తామన్న ఆయన.. రెండు సంవత్సరాల నుంచి రైతులకు బోనస్ లేదు.. రైతులంతా ముందుకు రండి.. అవసరమైతే విశాఖ డెయిరీ చైర్మన్ మారుద్దాం అని పిలుపునిచ్చారు. కష్టపడి పాలుపోసే రైతులను మోసం చేయడం అన్యాయం అన్నారు. రైతుల డబ్బులన్నీ దోచేస్తున్నారు.. మన జిల్లా పాలన్నీ తీసుకెళ్లి హైదరాబాద్‌లో ఎక్కువ ధరకు అమ్ముతున్నారని ఆరోపించారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు.