Amaravati: అసెంబ్లీ ఆవరణలోని నూతన భవనాన్ని ప్రారంభించారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు.. ఈ సందర్భంగా నూతన అసెంబ్లీ భవన నిర్మాణాన్ని కూడా త్వరలోనే ప్రారంభించనున్నట్టు వెల్లడించారు.. అసెంబ్లీ ఆవరణలో రూ.3.55 కోట్లతో ఈ భవనం నిర్మాణం చేశాం. మొదటి ఫ్లోర్ లో విప్ లకు కేటాయించాం.. మీడియా పాయింట్ కూడా ఏర్పాటు చేస్తాం అన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు.. ఈ భవనాన్ని ప్రారంభించడం మా అందరికీ ఆనందం.. ఈ భవన నిర్మాణం కోసం మంత్రి నారాయణ కృషి చేశారి ప్రశంసించారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు..
Read Also: Minors R*pe: దారుణం.. ముగ్గురు మైనర్ బాలికలపై ముగ్గురు యువకుల అత్యాచారం
ఈ భవనం 5 కోట్ల రూపాయల అంచనాలతో ప్రారంభించినా.. కేవలం రూ.3.50 కోట్లతోనే నిర్మాణం పూర్తి చేశామని వెల్లడించారు మంత్రి నారాయణ.. గతంలో దీని కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలన పూర్తి ఆలస్యం అయ్యింది.. త్వరలో కొత్త అసెంబ్లీ భవనం నిర్మాణం చేపడతాం.. డిజైన్లు పూర్తి అయ్యాయి.. త్వరలో అవి అందరికి విడుదల చేస్తాం అన్నారు మంత్రి పొంగోరు నారాయణ.. ఇక, శాసన సభలో మరో భవనం నిర్మాణం పూర్తి చేశాం… అసెంబ్లీ అవసరాలను నిధుల విడుదలకు ఇబ్బంది లేదన్నారు ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్.. కాగా, గత ప్రభుత్వ హయాంలో అమరావతిలో నిర్మాణాలు ఎక్కడిక్కడే ఆగిపోగా.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. మళ్లీ రాజధాని అమరావతిలో పనులు జోరుగా సాగుతోన్న విషయం విదితమే..