ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి దిగ్గజం ఎలన్ మస్క్ కు కొత్త చిక్కుల్లో చిక్కుకున్నారు. మస్క్ ప్రతిష్టాత్మకంగా తీసుకురావాలని చూస్తున్న బ్రెయిన్- కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ స్టార్టప్ న్యూరాలింక్ ప్రాజెక్టును ప్రారంభించి ఏడాది పూర్తయింది. ఏడాది బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ ఫేస్ టెక్నాలజీపై పరిశోధనలు చేస్తున్నారు. అయితే, దీనిపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు ఎదురౌతున్నాయి. ఈ ఏడాది మనిషి ప్రయోగాలు చేయబోతున్నారని చాలా కాలంగా చెబుతూ వస్తున్నారని, కానీ, ఈ ప్రాజెక్టు సక్సెస్ కాదని పలువురు మాజీ ఉద్యోగులు చెబుతున్నారు.…
ఎలన్ మస్క్ పరిచయం అక్కర్లేని పేరు. టెస్లా కార్ల కంపెనీని స్థాపించి లక్షలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. అంతేకాకుండా, స్పేస్ ఎక్స్ పేరుతో అంతరిక్ష ప్రయోగాలు చేపడుతున్నారు. ప్రపంచ కుబేరులను వెనక్కి నెట్టి ఎలన్ మస్క్ ప్రథమస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. 300 బిలియన్ డాలర్ల సంపదతో మస్క్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఎలన్ మస్క్ ను కీర్తిస్తూ ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. మస్క్ 17 ఏళ్ల వయసులో అమెరికాకు వచ్చాడని, సంపదను సృష్టించి…
ప్రపంచ కుబేరుడు, టెస్లా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తాను త్వరలోనే తన అన్ని ఉద్యోగాల నుంచి తప్పుకుంటానని, ఇన్‌ఫ్లుయెన్సర్ మాత్రమే కొనసాగుతానని, దీనిపై నెటిజన్లు ఏమనుకుంటున్నారో చెప్పాలని కోరుతూ మస్క్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఎలన్ మస్క్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో తెలియక సతమతమవుతున్నారు. కొన్ని రోజుల క్రితం మస్క్ టెస్లాలోని తన వాటా షేర్లను అమ్మెయ్యాలని…
క్షణాల్లో కోట్లు సంపాదించే తెలివైన వ్యక్తి ఎలన్ మస్క్. మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా పనులు చేసుకుంటూ వెళ్తుంటాడు. ఎలక్ట్రానిక్ కార్ల రంగంతో పాటుగా మస్క్ అంతరిక్షరంగంలోకి అడుగుపెట్టి దూసుకుపోతున్నారు. ఇతర గ్రహాలపైకి మనుషులను పంపించడమే లక్ష్యంగా ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ పనిచేస్తున్నది. అయితే, అనూహ్యంగా టెస్లా షేర్లు భారీగా పెరడగంతో ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా రికార్డ్ సాధించాడు. Read: ఫ్యాక్ట్స్: జనాభా కంటే ఆ దేశాన్ని సందర్శించేవారే ఎక్కువ… 300 బిలియన్ డాలర్ల…
అమెజాన్ సంస్థ అంతరిక్షరంగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. జెఫ్ బెజోస్ బ్లూఆరిజిన్ సంస్థ ఇటీవలే అంతరిక్ష యాత్రను విజయవంతంగా నిర్వహించింది. కమర్షియల్‌గా వ్యోమగాములను స్పేస్‌లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. అయితే, ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ ఇప్పటికే ఐఎస్ఎస్‌కు కావాల్సిన సరుకులను చేరవేస్తూ అందరికంటే ముందు వరసలో ఉన్నది. ఇక ఇదిలా ఉంటే చంద్రుడిమీదకు వ్యోమగాములను తీసుకెళ్లేందుకు నాసా ప్రయత్నాలు చేస్తున్నది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ ప్రయోగం చేస్తున్నది. Read: వైరల్: పాస్‌పోర్ట్…
ప్రపంచ కుబేరుడిగా ఇప్పటి వరకు కొనసాగిన అమెజాన్ జెఫ్ బెజోస్ రెండో స్థానానికి పడిపోయాడు. చాలా కాలంగా బెజోస్‌కు టెస్లా, స్పేస్ ఎక్స్ అధిపతి ఎలన్ మస్క్ పోటీ ఇస్తున్నాడు. శుక్రవారం రోజున మస్క్ కు రెందిన మస్క్ కంపెనీకి లక్ష కార్ల ఆర్డర్ రావడంతో మార్కెట్లో ఆయన షేర్లు భారీగా పెరిగాయి. ఒక్కరోజులోనే 31,100 కోట్ల రూపాయల సంపద పెరిగింది. 300 బిలియన్ డాలర్ల సంపద కలిగిన ఏకైక వ్యక్తిగా మస్క్ అవతరించాడు. కాగా, రెండో…
ఒకప్పుడు స్పేస్ లోకి వెళ్లడం అంటే చాలా ఖరీదైన విషయం. కేవలం వ్యోమగాములకు మాత్రమే అవకాశం ఉండేది. కానీ, టెక్నాలజీ పెరిగిపోవడం, స్పేస్ రంగంలోకి ప్రైవేట్ సంస్థలు ప్రవేశంచడంతో స్పేస్ టూరిజం మరింత ముందుకు కదిలింది. ఇప్పటికే వర్జిన్ గెలాక్టిక్, అమెజాన్ బ్లూ ఆరిజిన్, స్పేస్ ఎక్స్ సంస్థలు అంతరిక్ష పరిశోధన రంగంలోకి దిగడంతో పోటీ పెరిగింది. ఇప్పిటికే ఈ మూడు సంస్థలు సొంతంగా తయారు చేసుకున్న రాకెట్ల ద్వారా స్పేస్‌లోకి వెళ్ళొచ్చారు. కాగా, స్పేస్ టూరిజం…
రోదసి యాత్రలో మరో సువర్ణాద్యాయం మొదలైంది. ఇటీవలై ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా నలుగురు సామాన్య టూరిస్టులను స్పేస్ ఎక్స్ సంస్థ రోదసిలోకి పంపింది. భూకక్ష్యలో ఈ క్యాప్సుల్ మూడు రోజుల పాటు భూమిచుట్టూ పరిభ్రమించి ఈరోజు సురక్షితంగా భూమిమీదకు చేరింది. ఇందులో ప్రయాణం చేసిన నలుగురు వ్యక్తులు సురక్షితంగా ఉన్నారని స్పేస్ ఎక్స్ పేర్కొన్నది. ఈ క్యాప్యూల్ అట్లాంటిక్ మహాసముద్రంలో పారాచూట్ సహాయంతో ల్యాండ్ అయింది. నిపుణులైన వ్యోమగాములు లేకుండా సాధారణ ప్రయాణికులతో ఈ…
అంతరిక్షయానంలో ప్రైవేట్ సంస్థలు పోటీపడుతున్నాయి. వర్జిన్ గెలాక్టిక్, బ్లూ ఆరిజిన్ సంస్థలు ఇప్పటికే అంతరిక్షయానంలో ముందడుగు వేశాయి. కాగా, ఇప్పుడు స్పేస్ ఎక్స్ సంస్థ మరో అడుగు ముందుకు వేసి భూకక్ష్యలోకి వ్యోమనౌకను పంపింది. ఈ వ్యోమనౌకలో నలుగురు పర్యాటకులు ఉన్నారు. వీరు మూడు రోజుల పాటు ఈ వ్యోమనౌకలో భూమిచుట్టూ ప్రదక్షణ చేస్తారు. మూడు రోజుల తరువాత వీరు తిరిగి భూమిమీదకు రానున్నారు. స్పేస్ ఎక్స్ సంస్థ ఇన్ఫిరేషన్ 4 పేరుతో ఈ ప్రయోగాన్ని చేపట్టింది.…
ఎలన్ మస్క్ గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. వ్యాపారవేత్తగా మాత్రమే కాకుండా స్పేస్ ఎక్స్ పేరుతో అంతరిక్ష సంస్థను స్థాపించి స్పేస్ గురించిన పరిశోధనలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. నాసాతో కలిసి అనేక ప్రాజెక్టులను స్పేస్ ఎక్స్ సంస్థ చేపడుతున్నది. రాబోయే రోజుల్లో ఎలాగైనా భూమి నుంచి మనుషులను అంగారకుడిపైకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో స్సేష్ షిప్ ను తయారు చేస్తున్నారు. ఈ స్పేస్ షిప్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ రీయూజబుల్ స్పేస్‌షిప్ ద్వారా 100 మందిని అంగారకుడిమీదకు…