ప్రపంచ కుబేరుడిగా ఇప్పటి వరకు కొనసాగిన అమెజాన్ జెఫ్ బెజోస్ రెండో స్థానానికి పడిపోయాడు. చాలా కాలంగా బెజోస్‌కు టెస్లా, స్పేస్ ఎక్స్ అధిపతి ఎలన్ మస్క్ పోటీ ఇస్తున్నాడు. శుక్రవారం రోజున మస్క్ కు రెందిన మస్క్ కంపెనీకి లక్ష కార్ల ఆర్డర్ రావడంతో మార్కెట్లో ఆయన షేర్లు భారీగా పెరిగాయి. ఒక్కరోజులోనే 31,100 కోట్ల రూపాయల సంపద పెరిగింది. 300 బిలియన్ డాలర్ల సంపద కలిగిన ఏకైక వ్యక్తిగా మస్క్ అవతరించాడు. కాగా, రెండో స్థానంలో ఉన్న అమెజాన్ మాజీ సీఈవో జెఫ్ బెజోస్ ఆస్తి 196 బిలియన్లు. ఇద్దిర మధ్య తేడా దాదాపుగా 116 బిలియన్ డాలర్లు ఉన్నట్టు బ్లూంబెర్గ్ సంస్థ తెలియజేసింది.
Read: నూతన పరిశోధన: కరోనా వైరస్‌ను అంతం చేసేందుకు సరికొత్త యంత్రం…