ఒకప్పుడు స్పేస్ లోకి వెళ్లడం అంటే చాలా ఖరీదైన విషయం. కేవలం వ్యోమగాములకు మాత్రమే అవకాశం ఉండేది. కానీ, టెక్నాలజీ పెరిగిపోవడం, స్పేస్ రంగంలోకి ప్రైవేట్ సంస్థలు ప్రవేశంచడంతో స్పేస్ టూరిజం మరింత ముందుకు కదిలింది. ఇప్పటికే వర్జిన్ గెలాక్టిక్, అమెజాన్ బ్లూ ఆరిజిన్, స్పేస్ ఎక్స్ సంస్థలు అంతరిక్ష పరిశోధన రంగంలోకి దిగడంతో పోటీ పెరిగింది. ఇప్పిటికే ఈ మూడు సంస్థలు సొంతంగా తయారు చేసుకున్న రాకెట్ల ద్వారా స్పేస్‌లోకి వెళ్ళొచ్చారు. కాగా, స్పేస్ టూరిజం సక్సెస్ కావడంతో రాబోయే మూడు నాలుగేళ్లలో చంద్రునిపైకి టూరిస్టులను పంపేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీనికోసం స్పేస్ ఎక్స్ స్టార్ షిప్‌ను తయారు చేస్తున్నది. నాసా సహకారంతో ప్రయోగాలు చేస్తున్నది. చంద్రునిమీదకు వెళ్లేందుకు నలుగురు టూరిస్టులు సిద్దంగా ఉన్నారు. స్పేస్ రంగంలో పెట్టుబటులు పెట్టేందుకు పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లు ముందుకు వస్తుండటంతో స్పేస్ టూరిజంపై ప్రయోగాలు మరింత చురుగ్గా సాగుతున్నాయి. ముందుగా ఇద్దరు టూరిస్టులను చంద్రునిమీదకు పంపి అక్కడ వారం రోజులు ఉన్న తరువాత వారిని తిరిగి భూమిమీదకు తీసుకు వచ్చేవిధంగా ప్లాన్ చేస్తున్నారు. దీనికి తగినట్టుగా స్పేస్ షిప్ తయారీ జరుగుతున్నది. ఈ ప్రయోగం కోసం సుమారు రూ.21 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్టు స్సేస్ ఎక్స్ పేర్కొన్నది.