4B movement: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలవడం ఆ దేశంలోని లక్షలాది మంది మహిళలకు నచ్చడం లేదు. కమలా హారిస్ నేతృత్వంలోని డెమొక్రాట్ పార్టీ గెలుస్తుందని అంతా భావించినప్పటికీ, వాళ్ల కలలు డొనాల్డ్ ట్రంప్ విజయంతో చెరిగిపోయాయి.
నేడు దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో తెలంగాణ మంత్రులు, అధికారుల బృందం పర్యటనకు వెళ్తుంది. సౌత్ కొరియాలోని ముఖ్యమైన హన్ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్ ను ఈ బృందం సందర్శించనుంది.
North Korea: దక్షిణ కొరియా డ్రోన్లు తమ రాజధాని ప్యాంగ్యాంగ్ నగరంపై ఎగరడంపై ఉత్తర కొరియా తీవ్ర స్థాయిలో మండిపడింది. తమ దేశానికి వ్యతిరేకంగా కర పత్రాలను జార విడిచే డ్రోన్లు మా భూభాగంపై ఎగిరితే దక్షిణ కొరియా ఊహించని పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ హెచ్చరికలు జారీ చేశారు.
భారత పురుషుల హాకీ జట్టు అద్భుత ప్రదర్శనతో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీ-ఫైనల్స్‌లో దక్షిణ కొరియాను 4-1తో ఓడించింది. ఫైనల్‌లో భారత్ చైనాతో తలపడనుంది. కాగా.. ఈ టోర్నీలో ఇండియా అద్భుత ప్రదర్శన చేసి అజేయంగా నిలిచింది. రేపు (మంగళవారం) భారత్-చైనాల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలో పలు ఒప్పందాలు కుదిరాయి. ఈ పర్యటనలో మొత్తం రూ.31532 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. దాదాపు 30,750 కొత్త ఉద్యోగాలు రానున్నట్లు తెలిసింది. మొత్తం 19 కంపెనీలతో సంప్రదింపులు.. ఒప్పందాలు జరిగింది. పలు కీలక ఒప్పందాలతో అమెరికా, దక్షిణ కొరియా పర్యటన విజయవంతంగా ముగిసింది.
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు లక్ష్యంతో సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని బృందం చేపట్టిన విదేశీ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకుని దక్షిణ కొరియా చేరుకున్నారు.