CM Revanth Reddy: సీఎం రేవంత్ బృందం విదేశీ పర్యటనలో కుదిరిన ఒప్పందాలు ఇవే..
- సీఎం రేవంత్ బృందం విదేశీ పర్యటనలో కీలక ఒప్పందాలు
- రాష్ట్రానికి రూ.31532 కోట్ల పెట్టుబడులు
- దాదాపు 30750 కొత్త ఉద్యోగాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలో పలు ఒప్పందాలు కుదిరాయి. ఈ పర్యటనలో మొత్తం రూ.31532 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. దాదాపు 30,750 కొత్త ఉద్యోగాలు రానున్నట్లు తెలిసింది. మొత్తం 19 కంపెనీలతో సంప్రదింపులు.. ఒప్పందాలు జరిగింది. పలు కీలక ఒప్పందాలతో అమెరికా, దక్షిణ కొరియా పర్యటన విజయవంతంగా ముగిసింది.
Read Also: Hyderabad: సూసైడ్ చేసుకోవాలనుకున్న యువకులు.. టెక్నాలజీ సాయంతో కాపాడిన పోలీసులు
Also Read
- Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
- SIR: వీవీఐపీలకు SIR షాక్.. జైశంకర్, ఆర్మీ చీఫ్, CBI డైరెక్టర్ పేర్లు..
- Sahil Chauhan: 27 బంతుల్లో సెంచరీ.. టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు.. అతడికి ఇండియాతో సంబంధం ఏంటి..?
- Hamid Ansari row: ‘‘ దేశానికి హిందువులు ముప్పా.?’’.. హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై దుమారం..
ఈ పర్యటనలో కుదిరిన ఒప్పందాలు ఇవే..
1. కాగ్నిజెంట్:
అమెరికా తర్వాత హైదరాబాద్‌లో అతి పెద్ద క్యాంపస్. దాదాపు 15,000 ఉద్యోగాలు.
2. వాల్ష్ కార్రా హోల్డింగ్స్:
WE-హబ్ లో 5 మిలియన్ డాలర్ల పెట్టుబడులు. అభివృద్ది చెందుతున్న తెలంగాణ స్టార్టప్‌లలో 100 మిలియన్ల పెట్టుబడి.
3. ఆర్సీసియం:
దాదాపు 500 హై-ఎండ్ టెక్ ఉద్యోగాలు.
4. స్వచ్ఛ్ బయో:
రూ.1000 కోట్ల పెట్టుబడులు. 500 మందికి ఉద్యోగాలు.
5. ట్రైజిన్ టెక్నాలజీస్:
హైదరాబాద్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ డెవెలప్మెంట్, డెలివరీ సెంటర్. దాదాపు 1000 ఉద్యోగాలు.
6. హెచ్‌సీఏ హెల్త్ కేర్:
నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంపస్ విస్తరణ.
7. కార్నింగ్:
గ్లాస్ ట్యూబింగ్ ఫెసిలిటీ కేంద్రంలో వచ్చే ఏడాదిలో (2025) వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం.
8. వరల్డ్ బ్యాంక్:
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం, సహకారం.
9. వివింట్ ఫార్మా:
రూ.400 కోట్ల పెట్టుబడి, దాదాపు1000 మందికి ఉద్యోగాలు.
10. చార్లెస్ స్క్వాబ్:
హైదరాబాద్‌లో భారతదేశంలోనే మొదటి టెక్నాలజీ డెవెలప్మెంట్ సెంటర్.
Read Also: CM Chandrababu : కొత్త ఐటీ పాలసీపై సీఎం ఫోకస్.. నేడు కీలక సమీక్ష
దక్షిణ కొరియాలో శాంసంగ్, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్, జీఎస్ కల్టెక్స్, సెల్ ట్రయాన్ కంపెనీ ప్రతినిధులతోనూ సీఎం చర్చలు జరిపారు. హన్ రివర్ ప్రాజెక్టును సందర్శించి సియోల్ డిప్యూటీ మేయర్‌తో భేటీ అయ్యారు. శామ్‌సంగ్ హెల్త్ కేర్ యూనిట్‌తో సమావేశమై చర్చలు జరిపారు. అలాగే కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సీఎం రేవంత్‌రెడ్డి బృందం సందర్శించింది. కాల్‌టెక్స్ కంపెనీ ప్రతినిధులతో పెట్టుబడులపై చర్చలు జరిపింది. ఇప్పటికే వరంగల్ టెక్స్‌టైల్స్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ సానుకూలంగా స్పందించింది. దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ మోటార్స్ రాష్ట్రంలో మెగా కార్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. భారత్‌లోని హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజనీరింగ్ ద్వారా ఒక మెగా టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన పెట్టుబడులు పెడతామని ఆ కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డి బృందానికి తెలిపారు. అలాగే కొరియాలో పలు కంపెనీలు, వివిధ వ్యాపార, వాణిజ్య సముదాయాల ప్రతినిధులతో చర్చలు జరిపారు.
తాజావార్తలు
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
-
SIR: వీవీఐపీలకు SIR షాక్.. జైశంకర్, ఆర్మీ చీఫ్, CBI డైరెక్టర్ పేర్లు..
-
Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? ‘ప్యారడైజ్’ బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
-
Sahil Chauhan: 27 బంతుల్లో సెంచరీ.. టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు.. అతడికి ఇండియాతో సంబంధం ఏంటి..?
-
Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!