4B movement: ‘‘మీతో సె*క్స్ చేయం’’.. ట్రంప్ గెలుపుకి మగాళ్లని నిందిస్తున్న మహిళలు..
- ట్రంప్ గెలుపుని ఓర్వలేకపోతున్న ఓ వర్గం మహిళలు..
- మగవారిలో సె*క్స్‌కి నో చెబుతామని ప్రతిజ్ఞ..
- ‘‘4B మూమెంట్’’ని లేవనెత్తుతున్న మహిళలు..
- కమలా హారిస్ ఓటమిని జీర్ణించుకోలేని వైనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
4B movement: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలవడం ఆ దేశంలోని లక్షలాది మంది మహిళలకు నచ్చడం లేదు. కమలా హారిస్ నేతృత్వంలోని డెమొక్రాట్ పార్టీ గెలుస్తుందని అంతా భావించినప్పటికీ, వాళ్ల కలలు డొనాల్డ్ ట్రంప్ విజయంతో చెరిగిపోయాయి. అయితే, ట్రంప్ విజయానికి మగవాళ్లే కారణం అంటూ అక్కడి మహిళలు నిప్పులు చెరుగుతున్నారు. చాలా మంది మహిళలు పురుషులతో సె*క్స్, డేటింగ్, పిల్లలు కనడం వంటి వాటికి దూరంగా ఉండాలని 4B ఉద్యమంలో చేరారు.
నిజానికి ఎన్నికల సమయంలోనే కమలా హారిస్ క్యాంపెయిన్ ట్రంప్‌ని స్త్రీవాద వ్యతిరేక వ్యక్తిగా చిత్రీకరించింది. అయితే, అఖండ మెజారిటీతో ట్రంప్ గెలవడంతో చాలా మంది మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. వీటికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. దీంతో చాలా మంది మహిళావాదులు ఈ ‘‘4B మూమెంట్’’లో చేరారు. ఇప్పుడు ఇది అమెరికాలో ట్రెండ్ అవుతోంది. పురుషులతో సంబంధాలు పెట్టుకోవద్దని ఒక సెక్షన్ మహిళలు పెద్ద ఎత్తున నినదిస్తున్నారు.
Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
Read Also: Thummala Nageswara Rao: రైతు రుణమాఫీపై క్లారిటీ.. అప్పటి లోపు పూర్తిగా మాఫీ
అసలు ‘‘4B మూమెంట్’’ ఏంటి..?
4B అనేది ‘‘ 4 నోస్’’ అని అర్థం. కొరియన్‌లో ‘‘Bi’’ అంటే ‘‘వద్దు’’ అనే అర్థం వస్తుంది. 2018లో సౌత్ కొరియాలో మొదలైంది. అక్కడి రాడికల్ ఫెమినిస్టులు ఈ ఉద్యమాన్ని సోషల్ మీడియా ద్వారా విస్తృతం చేశారు. ఇది పురుషులతో ‘‘వివాహం,సెక్స్, బిడ్డల్ని కనడం, డేటింగ్’’ వంటివి వద్దు అనే నాలుగు విషయాలకు ప్రాధాన్యత ఇచ్చాయి.
అయితే, యూఎస్ ఎన్నికల్లో చాలా మంది మహిళలు తమ పునరుత్పత్తి హక్కుల్ని కాపాడే వ్యక్తి కమలా హారిస్ గెలవాలని కోరుకున్నారు. ట్రంప్ గెలవడంతో పురుషుల పాత్ర ఉందని భావిస్తున్న కొందరు మహిళలు ఈ ‘‘4B ఉద్యమం’’లో భాగస్వామ్యమయ్యారు. ఎన్నికలు ముగిసిన తర్వాత కొందరు మహిళలు సోషల్ మీడియా ద్వారా ఈ ఉద్యమాన్ని ప్రేరేపిస్తున్నారు. ‘‘మహిళలు మరవకండి మనకు శక్తి ఉంది. మన శరీరాలను మగవారికి అప్పగించడం మన ఛాయిస్. దీన్ని ఇక మనం చేయాల్సిన అవసరం లేదు’’అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. మరోవైపు 4బీ ఉద్యంలో పాల్గొన్న మహిళలపై మరో వర్గం మహిళలు విమర్శలు గుప్పిస్తున్నారు. ‘‘మీరు ఒక వ్యక్తితో పడుకోవాలని అనుకోంటే, ఒక్క వ్యక్తి నిద్ర కూడా చెడిపోదు’’ అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు.
తాజావార్తలు
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
-
Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు.. ఓ లుక్కేయండి..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు