Telangana Ministers: దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో తెలంగాణ మంత్రులు, అధికారుల బృందం ఇవాళ పర్యటించనున్నారు. మూసీ పునరుజ్జీవంపై అధ్యయనానికి మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్, ఎంపీ చామల కిరణ్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి , నగర మేయర్, ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ, మూసి రివర్ ప్రంట్ అధికారుల బృందం పర్యటించనుంది. ఈ నెల 21 నుంచి 24 వరకు వీరి పర్యటన కొనసాగుతుంది. సియోల్‌లోని రివర్ ఫ్రంట్ అభివృద్ధిని మంత్రుల బృందం పరిశీలించనుంది. ఇందుకోసం 50 మందితో కూడిన బృందం 20న హైదరాబాద్‌లో బయలుదేరింది.
నగరంలో మాపోలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే వనరుల పునర్వినియోగం కేంద్రాన్ని మంత్రులు, అధికారులు సందర్శించనున్నారు. సియోల్ నగరపాలక సంస్థ రోజుకు వెయ్యి టన్నుల వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. దీనికోసం WTE ( వెస్ట్ టూ ఎనర్జీ ) టెక్నాలజీ వినియోగం, పర్యావరణంపై దుష్ప్రభావం పడకుండా నగర వ్యర్థాలను పునర్వినియోగంలోకి తెచ్చే అద్భుత సాంకేతిక పరిజ్ఞానం వినియోగం చేపట్టింది. సియోల్ నగర పాలక్ సంస్థ మరో 10 ఏళ్లలో పూర్తిగా భూ ఉపరితలం నుండి తొలగించి భూగర్భంలో అతిపెద్ద ప్లాంట్ ను నిర్మించబోతుంది. ఇటువంటి నాలుగు ప్లాంట్లను ప్రభుత్వం నిర్మించేందుకు సిద్దమైంది. ఈ విధానాలను అధ్యయనం చేసి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అమలు చేసే అవకాశంపై తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తుంది.
Group 1 Exams: నేడు గ్రూప్ -1 పరీక్షకు సర్వం సిద్ధం.. కేంద్రాల వద్ద భారీ బందోబస్తు..