North Korea: రోడ్లను పేల్చేసిన నార్త్ కొరియా.. మండిపడిన దక్షిణ కొరియా..
- ఉత్తర- దక్షిణ కొరియా దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత..
- దక్షిణ కొరియాను కలిపే రోడ్లను పేల్చేయించిన కిమ్ జోంగ్ ఉన్..
- కిమ్ పై తీవ్ర స్థాయిలో మండిపడిన దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
North Korea: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి తాను అనుకున్నదే చేశాడు. దక్షిణ కొరియాను కలిపే రహదారులను పేల్చేయించాడు. ఈ విషయాన్ని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఈరోజు ఉదయం మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. తమ వైపు ఉన్న రోడ్లను సైన్యం కాపాడుతోందన్నారు. కిమ్ తన టాప్ మిలిటరీ, సెక్యూరిటీ అధికారులతో సమావేశం నిర్వహించిన తర్వాత రోజే ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందులో కిమ్ జోంగ్ ఉన్ మాట్లాడుతూ.. దక్షిణ కొరియా డ్రోన్ల వస్తే తీవ్రమైన కవ్వింపు చర్యగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు కొన్ని రహస్య సూచనలు చేశాడని ఆ దేశ మీడియా వెల్లడించింది.
Read Also: IPL 2025 Auction: రోహిత్‌ను దక్కించుకోవాలంటే 20 కోట్లు పక్కనపెట్టుకోవాలి: అశ్విన్
Also Read
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
ఇక, కిమ్ సర్కారు శతఘ్ని దళాన్ని సరిహద్దుల దగ్గరకు పంపింది. సౌత్ కొరియా డ్రోన్‌లు కనిపిస్తే వెంటనే దాడి స్టార్ట్ చేయాలని వారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు దక్షిణ కొరియా మాత్రం కిమ్ జోంగ్ ఉన్ ఆరోపణలను తీవ్రంగా ఖండించాయి. తమ ప్రజల భద్రత ప్రమాదంలో పడితే మాత్రం నార్త్ కొరియా తీవ్రంగా శిక్షిస్తామని వార్నింగ్ ఇచ్చింది. కాగా, 2000 సంవత్సరంలో రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడటంతో ఉత్తర- దక్షిణ కొరియాల మధ్య రోడ్లను నిర్మించారు. దీంతో పాటు రెండు రైలు మార్గాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. వీటి దగ్గర భారీ భద్రతను సైతం ఏర్పాటు చేశారు. కానీ, ఉత్తర కొరియా అణ్వాయుధాల అభివృద్ధి, ఇతర కారణాలతో ఆ తర్వాత ఈ మార్గాలను బంద్ చేశారు.
Read Also: SSC GD: భారీ రిక్రూట్‌మెంట్.. పది పాసైతే చాలు.. కానిస్టేబుల్ ఉద్యోగం
అయితే, ఈ రోడ్ల ధ్వంసంపై గత వారం నార్త్ కొరియా ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది. దక్షిణ కొరియాతో తమకున్న సరిహద్దును పూర్తిగా క్లోజ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నాం.. ఆ దిశగా చర్యలు కొనసాగుతున్నట్లు ఉత్తర కొరియా సైన్యం పేర్కొనింది. అకస్మాత్తుగా సంఘర్షణ తలెత్తకుండా అమెరికా మిలిటరీకి ముందే సమాచారం ఇచ్చామని చెప్పుకొచ్చింది. రెండు కొరియాల మధ్య ఉన్న రోడ్లు, రైల్వే మార్గాలను మూసేస్తున్నట్లు ప్యోగ్యాంగ్ వెల్లడించింది.
తాజావార్తలు
-
Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!