South Central Railway: ప్రయాణికులకు శుభవార్త.. సంక్రాంతికి మరిన్ని ప్రత్యేక రైళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
South Central Railway: సంక్రాంతి రద్దీని దృష్టిని పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ మేరకు మరో 30 అదనపు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. జనవరి 1 నుంచి 20వ తేదీ మధ్యలో ఈ ప్రత్యేక రైళ్లను వివిధ ప్రాంతాల మధ్య నడపనున్నట్లు తెలిపారు. ప్రయాణికుల డిమాండ్ దృష్ట్యా సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, వికారాబాద్ నుంచి నర్సాపూర్, మచిలీపట్నం, కాకినాడ మార్గంలో ఈ ప్రత్యేక రైళ్లను నడుపనున్నారు. ఆయా రైళ్లలో రిజర్వుడ్, అన్ రిజర్వుడ్ బోగీలను అందుబాటులో ఉంచనున్నారు. ప్రయాణికుల సౌకర్యార్ధం రాత్రి సమయాల్లో ఈ రైళ్లు నడుస్తాయి.
Read Also: Cell Phones Robbery: పోలీస్ డ్రెస్ లో వచ్చి… సెల్ ఫోన్స్ చోరీ
Also Read
- UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
- Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ 'అగ్గిపెట్టె మచ్చ' మృతి..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
కాగా జనవరి 9న సికింద్రాబాద్ – కాకినాడ టౌన్, 10న కాకినాడ టౌన్ – వికారాబాద్, 11న వికారాబాద్ – నరసాపూర్, సికిందాబ్రాద్ – కాకినాడ టౌన్, 12న నరసాపూర్ – సికింద్రాబాద్, కాకినాడ టౌన్ – వికారాబాద్, 13న వికారాబాద్ – కాకినాడ టౌన్, సికింద్రాబాద్ – నరసాపూర్, 14న కాకినాడ టౌన్ – సికింద్రాబాద్, నరసాపూర్ – సికింద్రాబాద్, 15న సికింద్రాబాద్ – కాకినాడ టౌన్, 16న సికింద్రాబాద్ – కాకినాడ టౌన్, కాకినాడ టౌన్ – వికారాబాద్, 17న కాకినాడ టౌన్ – సికింద్రాబాద్, వికారాబాద్ – కాకినాడ టౌన్, 18న కాకినాడ టౌన్ – సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ రైళ్లకు ఈ నెల 31వ తేదీన ఉదయం 8 గంటల నుంచి అడ్వాన్స్‌డ్ రిజర్వేషన్ సౌకర్యం ప్రారంభం కానుంది. ఈ రైళ్లకు నడికుడి, సత్తెనపల్లిలో హాల్టింగ్ ఉంటుంది. సంక్రాంతి ప్రత్యేక రైళ్లలో ప్రయాణించాలనుకుంటేపీఆర్‌ఎస్ కౌంటర్లతో పాటు ఐఆర్‌సీటీసీ యాప్ లేదా వెబ్‌సైట్‌లో రిజర్వుడ్ టిక్కెట్లను బుకింగ్ చేసుకోవచ్చని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. జనరల్ బోగీలలో ప్రయాణించదలిస్తే రైల్వేస్టేషన్లలో టిక్కెట్ కౌంటర్ల వద్ద రద్దీ దృష్ట్యా యూటీఎస్ మొబైల్ యాప్‌ని వినియోగించి బుకింగ్ చేసుకోవాలని సూచించారు.
తాజావార్తలు
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!