Priyanka Gandhi: రాష్ట్రపతిని సోనియా గౌరవించారు.. మీడియా మాత్రం వక్రీకరించింది
- రాష్ట్రపతిని సోనియా గౌరవించారు.. మీడియా మాత్రం వక్రీకరించింది
- తల్లికి మద్దతుగా నిలిచిన వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంటలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంపై సోనియాగాంధీ స్పందించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది. అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సోనియా క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ డిమాండ్ చేసింది. అంతేకాకుండా రాష్ట్రపతి భవన్ కూడా సోనియా వ్యా్ఖ్యలను ఖండించింది. సోనియా వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. వివాదం ముదురుతున్న వేళ వయనాడ్ ఎంపీ, సోనియా కుమార్తె ప్రియాంక స్పందించారు. తన తల్లికి రాష్ట్రపతి అంటే అపారమైన గౌరవం ఉందని.. తన తల్లి వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని తప్పుపట్టారు. క్షమాపణ చెప్పాల్సింది తన తల్లి కాదు.. దేశాన్ని నాశనం చేసిన బీజేపీ క్షమాపణ చెప్పాలని అన్నారు. తన తల్లికి ఇప్పుడు 78 ఏళ్లు.. అలాగే రాష్ట్రపతి కూడా పెద్ద వయసు వారు. వారిద్దరూ గౌరవనీయమైన వ్యక్తులు అని ప్రియాంక పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: AP DGP: ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు ధన్యవాదాలు.. వారిని మాత్రం విదిలి పెట్టం..
Also Read
- Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
- Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
- Supreme Court: తమిళనాడు ‘‘మైండ్ సెట్’’ మార్చుకోవాలి.. హిందీ వ్యతిరేకతపై సుప్రీం సీరియస్..
శుక్రవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసగించారు. అనంతరం పార్లమెంట్ హాల్ నుంచి సోనియా, రాహుల్, ప్రియాంక బయటకు వచ్చారు. అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు.. రాష్ట్రపతి ప్రసంగంపై ప్రశ్నించారు. దీనికి సోనియా బదులిస్తూ… ప్రసంగం చివరకు వచ్చేసరికి రాష్ట్రపతి బాగా అలసిపోయారని.. ఆమె మాట్లాడలేకపోయారని.. పాపం అంటూ ఆమె వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోనియా వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. అత్యున్నత స్థానంలో ఉన్న గిరిజన మహిళను అవమానించారని.. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Working hours: ‘‘వారానికి 55-60 గంటలు పనిచేస్తే ఇక అంతే’’.. ఆర్థిక సర్వేలో కీలక విషయాలు..
తాజాగా ఇదే అంశంపై రాష్ట్రపతి భవన్ స్పందించింది. సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. రాష్ట్రపతి ఏ సమయంలోనూ అలసిపోలేదని స్పష్టం చేసింది. కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలు దురదృష్టకరమని… మాట్లాడకుండా ఉండాల్సిందని హితవు పలికింది. అణగారిన వర్గాలు, మహిళలు, రైతుల కోసం మాట్లాడుతున్నప్పుడు రాష్ట్రపతికి అలసట దరిచేరదని.. రాష్ట్రపతి ప్రసంగంపై వ్యాఖ్యలు చేసిన నాయకులకు భారతీయ భాష, యాసలతో పరిచయం లేకపోయి ఉండొచ్చని పేర్కొంది. అందుకే రాష్ట్రపతి అలసిపోయినట్లు వాళ్లకు అనిపించొచ్చని.. ఏదేమైనా రాజ్యాంగబద్ధంగా అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇది కూడా చదవండి: BSNL New Plan: బీఎస్ఎన్ఎల్ న్యూ రీఛార్జ్ ప్లాన్.. జస్ట్ రూ. 99కే అదిరిపోయే బెనిఫిట్స్
తాజావార్తలు
-
Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
-
Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
-
Prithvi Shaw: యువ క్రికెటర్ పృథ్వీ షా–ఆకృతి అగర్వాల్ సంచలన నిర్ణయం.. పెళ్లికి ముందే బ్రేకప్..
-
Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ పాదయాత్రపై కోమటిరెడ్డి సెటైర్లు..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!