నేషనల్ హెరాల్డ్” కేసు విచారణ వేగంగా సాగడం లేదు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కరోనా చికిత్స కొనసాగుతోంది. ఇవాళ ఈడీ విచారణ కు సోనియా గాంధీ హాజరుకాలేకపోయారు. వైద్యులు అనుమతిస్తేనే ఈడీ విచారణకు సోనియా గాంధీ హాజరవుతారు. మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించి ఈ రోజు (జూన్ 8) విచారణకు హాజరవ్వాలని సోనియా గాంధీకి నోటీసులు ఇచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED). సోనియా గాంధీకి కరోనా సోకడంతో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. ఈ రోజు కాకుండా,…
కరోనా మహమ్మారి మరోసారి తన ప్రతాపం చూపిస్తోంది. దేశంలో మరోసారి కరోనా కేసులు నెమ్మదిగా విస్తరిస్తున్నాయి. తాజాగా పలువురు రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. గురువారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా ఒక్క రోజు వ్యవధిలోనే ఆమె కుమార్తె ప్రియాంకాగాంధీ కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ప్రియాంక గాంధీ ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించారు. తాను కరోనా స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నట్లు తెలిపారు. కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్‌గా…
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కరోనా పాజిటివ్ గా తేలింది. ఆమె తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్నట్లు, స్వల్పంగా జ్వరం ఉన్నట్లు కాంగ్రెస్ అధకార ప్రతినిధి రణ్ దీప్ సుర్జేవాలా ప్రకటించారు. కరోనా నుంచి సోనియా గాంధీ త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రార్థిస్తున్నారు. కరోనా బారి నుంచి త్వరగా కోలుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మానిక్కం ఠాగూర్, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క కోరుకున్నారు. నిన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), నేషనల్ హెరాల్డ్…
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఈ రోజు ఈడీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు సమన్లు జారీ చేసింది. ఈ నెల 8న సోనియా గాంధీని, 5న రాహుల్ గాంధీని హాజరుకావాల్సిందిగా కోరింది. ఈ కేసులో వీరిద్దరి స్టేట్మెంట్లను రికార్డ్ చేయనుంది ఈడీ. అయితే ఈడీ సమన్లపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేకే బీజేపీ ప్రభుత్వం ఈడీ, ఐటీల వంటి కేంద్ర సంస్థలను ఉపయోగిస్తోందని విమర్శిస్తున్నారు. బ్రిటిష్…
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో తాజాగా ఈడీ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో పాటు ఎంపీ రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది. జూన్ 5న రాహుల్ గాంధీని, జూన్ 8న సోనియాగాంధీని తమ ముందు హాజరు కావాలని కోరింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇద్దరు స్టేట్మెంట్లు రికార్డు చేసుకోనున్నారు ఈడీ అధికారులు. అయితే కాంగ్రెస్ నాయకులకు సమన్లు ఇవ్వడాన్ని ఆ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఇది కక్ష సాధింపు చర్య అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్…
రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. ఇప్పుడు ఆయన మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ నేతలు డప్పు కొడుతున్నట్టు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ తల్లి కాదని, దేశ ద్రోహి అని విమర్శించారు. అసలు కాంగ్రెస్ పార్టీనే దేశద్రోహి పార్టీ అంటూ బాంబ్ పేల్చారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా రావన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి…
కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ సీట్ల వ్యవహారం పెద్ద దుమారం రేపుతోంది. 10 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ జాబితా ప్రకటించగా.. కొందరు సీనియర్ నేతలు సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఈ జాబితాలో కాంగ్రెస్ ముంబై యూనిట్ ఉపాధ్యక్షురాలు, నటి నగ్మా కూడాఉన్నారు. 2003-2004లో తాను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు రాజ్యసభ అవకాశం ఇస్తామని సోనియా హామీ ఇచ్చారని.. అయితే 18 ఏళ్లు దాటినా తనకు అవకాశం ఇవ్వలేదని నగ్మా ఆరోపించారు. మహారాష్ట్ర నుంచి…
రెడ్లకు పగ్గాలిస్తేనే పార్టీలకు మనుగడ ఉంటుందంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. సొంత పార్టీ నాయకులు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ మూల విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ కుండబద్దలు కొట్టారు. తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమంజసం కాదని ఆయన రేవంత్‌కు బహిరంగ లేఖ…
మాజీ ప్రధాని, స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి ఇవాళ. జాతీయ ఉగ్రవాద వ్యతిరేకదినంగా ఈరోజుని జాతియావత్తూ జరుపుకుంటోంది. రాజీవ్ గాంధీ 1991, మే 21న హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజీవ్ గాంధీ దేశమంతా విస్తృతంగా తిరగుతున్నారు. చెన్నైకు సమీపంలో ఉన్న శ్రీ పెరంబదూర్ కు రాజీవ్ గాంధీ మే 21న ఎన్నికల ప్రచారం కోసం వెళ్లారు. రాత్రి ఎనిమిదిన్నర సమయంలో ఎల్ టీటీఈకి చెందిన థాను, శివరాజన్, హరిబాబు తదితరులు అప్పటికే…