రాహుల్ గాంధీ అతి ధైర్యం, పట్టుదలతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. రెండుసార్లు ప్రధానిగా అవకాశం వచ్చినా ఆర్థికవేత్తకు అవకాశం ఇచ్చారని రాహుల్‌ను వీహెచ్ కొనియాడారు.
Sonia Gandhi Joins Bharat jodo Yatra: కాంగ్రెస్ గత వైభవం కోసం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ‘ భారత్ జోడో యాత్ర’ చేపట్టింది. వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. ఈ యాత్రకు ప్రజల నుంచి స్పందగ బాగానే వస్తోంది. సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారిలో ప్రారంభం అయిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతోంది. గురువారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో కలిసి…
Sonia Gandhi Offers Prayers At Mysuru Temple: దసరా సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో ఉన్న సోనియాగాంధీ మైసూరు జిల్లా హెచ్ డీ కోట అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ ఆలయంలో పూజలు చేశారు. కర్ణాటకలో జరుగుతున్న కాంగ్రెస్ జోడో యాత్రలో గురువారం పాల్గొనబోతున్నారు సోనియాగాంధీ. దీని కోసం ఆమె సోమవారమే కర్ణాటక చేరుకున్నారు. మైసూరులో ఓ ప్రైవేట్ రిసార్టులో ఆమె ఉన్నారు.
Prasanth Kishore: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీహార్ లో నేటి నుంచి తన పాదయాత్రను ప్రారంభించారు. 'జన్ సురాజ్' ప్రచారంలో భాగంగా మహాత్మాగాంధీ జయంతి రోజున తూర్పు చంపారన్ జిల్లా నుంచి ఇవాళ పాదయాత్ర ప్రారంభించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, కేరళ ఎంపీ శశి థరూర్, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే, జార్ఖండ్ కాంగ్రెస్ నాయకుడు కేఎన్ త్రిపాఠి శుక్రవారం ఆ పార్టీ అధ్యక్ష పదవి కోసం జరుగుతున్న ఎన్నికల్లో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
రాజస్థాన్‌లో నెలకొన్న రాజకీయ రగడ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తాత్కాలిక కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఇవాళ ఢిల్లీలో సమావేశం కానున్నారు.