Revanth Reddy: ఓటు అడుగుతున్న రాజగోపాల్ రెడ్డికే మునుగోడులో ఓటు లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy Fires On Rajagopal Reddy In Munugode By Election Campaign: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజగోపాల్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. తనకు ఓటు వేయమని అడుగుతున్న రాజగోపాల్ రెడ్డికే ఓటు లేదని, అసలు ఇక్కడ ఊరు కూడా లేదని, అలాంటి వ్యక్తికి మునుగోడు ప్రజలంతా ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. ఇంతకుముందు కాంగ్రెస్ తరఫున 22 వేల మెజార్టీతో గెలిచి, ఇప్పుడు 22 వేల కోట్ల కాంట్రాక్టుకు రాజగోపాల్ రెడ్డి అమ్ముడుపోయాడని ఆరోపించారు. ఈరోజు తాము గొప్పోళ్లమని చెప్పుకొని తిరుగుతున్న నాయకులు.. 2009కి ముందు వాళ్లెవరో కూడా ప్రజలకు తెలియదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ను ఖతం చేయాలన్న ఉద్దేశంతో బొడ్డులో కత్తి పెట్టుకుని తిరిగిన నేతలను తమ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేల పదవులు ఇచ్చిందని అన్నారు.
మునుగోడులో తమ కాంగ్రెస్ పార్టీని గెలిపించమని కోరిన రేవంత్ రెడ్డి.. మునుగోడు నియోజకవర్గాన్ని తానే దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారు. అంతేకాదు.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను మునుగోడుకు తీసుకువస్తానన్నారు. డిండి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఐదు వేల కోట్ల నిధులు ఇప్పిస్తానని, మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి తన బాధ్యతేనని మాటిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి, అభివృద్ధికి నాంది పలకాలని పిలుపునిచ్చారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని జోస్యం పలికారు. అంతకుముందు.. బీజేపీ మంత్రాలకు చింతకాయలు రాలవన్న ఆయన.. టీఆర్ఎస్ తంత్రాలకు ప్రజల సమస్యలు తీరవంటూ విమర్శలు గుప్పించారు. తమ కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతిని 30 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు.
Also Read
- CM Revanth Reddy: “చర్చ తర్వాతే నిర్ణయం తీసుకుంటాం”.. సభలో సభ్యుల తీరుపై సీఎం ఆగ్రహం..!
- Nandana Arrest: యూట్యూబర్ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎయిర్‌పోర్టులో అరెస్ట్.!
- CM Revanth: కమ్యూనిస్టుల పోరాటం.. కాంగ్రెస్ పరిష్కారం.! సీఎం కీలక వ్యాఖ్యలు..
- Bhatti Vikramarka: సింగరేణి 128 మంది ఉద్యోగుల భవితవ్యంపై నిర్ణయం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన.!
తాజావార్తలు
-
Python in Car: కారులో 7 అడుగుల కొండచిలువ.. బోనెట్ తెరవగానే షాక్..
-
ISRO: ‘‘ఇస్రో ప్రైవేటీకరణ కాదు’’.. ఉద్యోగులకు చైర్మన్ భరోసా..
-
Trump: న్యూ మెక్సికో రాష్ట్రం పేరు మార్చేందుకు ట్రంప్ ప్లాన్.. సాధ్యమేనా? రూల్స్ ఇవే!
-
Bigg Boss 10 Contestants Remuneration: బిగ్‌బాస్ హౌస్‌లో రాంప్రసాద్‌కు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్.. మిగిలిన వారికి ఇలా..
-
Vijay DMK Attack: అసెంబ్లీలో సీఎం విజయ్ విశ్వరూపం.. డీఎంకేపై తీవ్రస్థాయిలో ఫైర్..
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!