SomiReddy: ఏపీలో బహిరంగ సభలు, రోడ్డు షోలపై వైసీపీ ప్రభుత్వం రాత్రికి రాత్రే ఆంక్షలు విధిస్తూ ప్రత్యేకంగా జీవో విడుదల చేయడాన్ని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తప్పుబట్టారు. ఈ సందర్భంగా జగన్ సర్కారు తీరుపై సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపై సభలు, సమావేశాలు పెట్టరాదన్న ప్రభుత్వ నిర్ణయం హేయమని అన్నారు. స్వాతంత్య్రానికి ముందు ఇవే ఆంక్షలు ఉండి ఉంటే దేశానికి స్వాతంత్రం వచ్చేది కాదని సోమిరెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో…
Somireddy Chandramohan Reddy: వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. జగన్ పాలనలో పంటలపై పెట్టుబడితో పాటు ఎరువుల ధరలు కూడా విపరీతంగా పెరిగాయని సోమిరెడ్డి ఆరోపించారు. టీడీపీ హయాంలో తుఫాన్ సమయంలో నష్టపోయిన రైతులకు అండగా నిలిచామని గుర్తుచేశారు. హెక్టార్ పత్తికి రూ. 15 వేలు, అరటికి రూ. 30 వేలు, చెరకుకు రూ. 15 వేల పరిహారం అందించి ఆదుకున్నామని తెలిపారు. తుఫాన్ కారణంగా గాయపడిన వారికి…
గోదావరి మహోగ్రరూపం దాల్చడంతో.. మరోసారి పోలవరం ప్రాజెక్టు, పోలవరం ముంపు ప్రాంతాల వివాదం తెరపైకి వచ్చింది.. ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన మండలాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని, పోలవరం ఎత్తును తగ్గించాలనే డిమాండ్ తెలంగాణ నుంచి ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధుల నుంచి వినిపిస్తుండగా.. ఏపీ నుంచి దీనిపై కౌంటర్‌లు పేలుతున్నాయి.. ఇక, ఈ వ్యవహారంపై స్పందించిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. పోలవరం మీద తెలంగాణతో పాటు ఢిల్లీ వాళ్లు దిగివచ్చినా..…
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులోని శ్రీ దామోదర సంజీవయ్య థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వద్ద కార్మికులకు టీడీపీ, సీపిఐ, సీపీఎం అఖిలపక్ష నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. భారత దేశంలోనే సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో ఏర్పాటు చేసిన విద్యుత్ కేంద్రాన్ని ప్రైవేటీకరణ చేయడం సిగ్గు చేటని ఆయన మండి పడ్డారు. అధికార దుర్వినియోగం తోనే బూడిద తోట్టెలు కూలిపోయాయని, విద్యుత్ ఉత్పత్తి…
అవినీతి చేసే ఎమ్మెల్యేలు, మంత్రుల కోసం యాప్ ఎందుకు పెట్టలేదు అంటూ వైసీపీ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రభుత్వ అండ లేకుండా ఎవరైనా మైనింగ్ చేయగలరా..? అని ప్రశ్నించారు. ఇసుక అక్రమాల గురించి బొల్లా బ్రహ్మానాయుడు, విత్తన అక్రమాల గురిoచి ఆర్కే మాట్లాడలేదా..? అని ఆయన అన్నారు. కృష్ణపట్నం పోర్టులోకి లారీలు వెళ్లాలంటే కాకాణి టోల్…
ఏపీ జెన్‌కో థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నెల్లూరులో టీడీపీ, సీపీఎం, సీపీఐ, కార్మిక సంఘాల నేతల సమావేశం జరిగింది. ఈ మేరకు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, మోహన్ రావు, అంకయ్య, రామరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు…
ఒంగోలు సమీపంలో టీడీపీ ఈనెల 27, 28 తేదీల్లో మహానాడు కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ మేరకు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం మహానాడు కార్యక్రమం ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఒంగోలులో టీడీపీ మహానాడు నిర్వహిస్తుంటే వైసీపీకి కడుపు మంటగా ఉందని సోమిరెడ్డి ఆరోపించారు. రాష్ట్రాన్ని పరిపాలించడం చేతకాక గడపగడపకు వెళితే జనం మొహం మీద కొడుతున్నారని ఎద్దేవా చేశారు. MLA…
వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించేందుకు సిద్ధం అవుతోంది ఏపీ ప్రభుత్వం.. అయితే, దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.. రైతులను దొంగలుగా భావిస్తున్నారా అంటూ ప్రభుత్వంపై మండిపడ్డ ఆయన.. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే ఉద్యమిస్తామని హెచ్చరించారు.. మీటర్లు బిగిస్తే 30 శాతం విద్యుత్ ఆదా అవుతుందన్న ప్రభుత్వం కామెంట్ల వెనుకున్న అర్థమేంటీ..? రైతులను దొంగలుగా ప్రభుత్వం భావిస్తోందా..? మీటర్లు పెట్టకపోతే వచ్చే నష్టమేంటీ..? అని నిలదీశారు. విద్యుత్ దోచేయడానికి…
చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే ఏపీ పుననిర్మాణం జరిగిందని తెలిపారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. ఆ తర్వాతే రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగుల వేస్తుందన్నారు.. కానీ, జగన్ పాలనా వల్ల రాష్ట్రం అప్పులపాలైందని విమర్శించారు. అయితే, ప్రస్తుతం సీట్లు గురించి చర్చే అవసరం లేదు.. ముందు జగన్ పరిపాలనకు చమరగీతం పాడాలన్నారు.. వైసీపీ అధికారంలోకి వచ్చిక సీఎం జగన్ ఏపీని వ్యాపారం కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. Read Also: Sarkaru Vaari Paata:…
తెలంగాణ మంత్రి కేటీఆర్ పొరుగు రాష్ట్రంపై చేసిన వ్యాఖ్యలు రచ్చగా మారాయి.. ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు కేటీఆర్‌కు కౌంటర్ ఇస్తే.. కొందరు టీడీపీ నేతలు స్వాగతించారు.. మరికొందరు టీఆర్ఎస్-వైసీపీ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. అయితే, కేటీఆర్ ఎపిసోడ్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.. నిన్నటి టీడీపీ నేతల కామెంట్లకు భిన్నంగా సోమిరెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి.. తెలంగాణ ప్రభుత్వాన్ని ఆకాశానికెత్తేశారు సోమిరెడ్డి.. తెలంగాణను చూసి ఏపీ కొన్ని అంశాలైనా నేర్చుకోవాల్సిన…