బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఒక కారుకు నా స్టిక్కర్ ఉందని కథనాలు వచ్చాయని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. దీనిపై టీడీపీ నేత సోమిరెడ్డి స్పందించిన పలు ఆరోపణలు చేశారు.. నా ఆధ్వర్యంలోనే పార్టీ జరిగిందని.. నా పాస్ పోర్ట్ దొరికిందని.. గోపాల్ రెడ్డి నాకు సన్నిహితుడని చెప్పారు.. దీనిపై నేను సోమిరెడ్డికి సవాల్ విసిరాను.. బ్లడ్ శ్యాంపిల్ ఇచ్చేందుకు సిద్ధం.
బెంగుళూరు రేవ్ పార్టీలో తనకు సంబంధించిన వాళ్లెవరూ లేరని.. ఈ విషయంపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. బెంగుళూరు రేవ్ పార్టీ విషయంలో తనపై తప్పడు ప్రచారం చేస్తున్నారని.. సోమిరెడ్డి చంద్రమోహన్ ఏదేదో మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
నెల్లూరు జిల్లాలో ఐదు వేల కోట్ల రూపాయల విలువైన సిలికాన్.. 3 వేల కోట్ల విలువైన తెల్ల రాయిని దోచేశారంటూ టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో అక్రమంగా జరుగుతున్న మైనింగ్ ను అడ్డుకోవాలని కోరుతూ టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. నిన్న సాయంత్రం నుంచి మైన్ ఎదుట నిరసన చేస్తున్నారు.