Somireddy vs Kakani: సోమిరెడ్డికి టీడీపీ టికెట్.. మంత్రి కాకాణి సంతోషం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Somireddy vs Kakani: జనసేన-బీజేపీ కూటమితో కలిసి ఎన్నికలకు సిద్ధం అవుతోన్న తెలుగుదేశం పార్టీ.. ఈ రోజు మూడో జాబితాను విడుదల చేసింది.. అయితే, ఈ సారి మాజీ మంత్రి, సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి టికెట్ వస్తుందా? రాదా? అనే చర్చ సాగింది.. కానీ, మూడో జాబితాలో ఆయనకు చోటు దక్కింది.. నెల్లూరు జిల్లా సర్వేపల్లి అసెంబ్లీ సీటును సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి కేటాయించారు టీడీపీ అధినేత చంద్రబాబు.. మొదటి, రెండు జాబితాల్లో సోమిరెడ్డికి చోటు దక్కకపోయినా.. మూడో జాబితాలో స్థానాన్ని దక్కించుకున్నారు. దీనిపై సోమిరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.. ఇక, ప్రచారానికి సిద్ధం అవుతున్నారు. మరోవైపు.. మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డి కూడా ఈ పరిణామాలపై ఆనందం వ్యక్తం చేశారు.
సోమిరెడ్డికి టీడీపీ టికెట్ రావడంపై వంగ్యాస్త్రాలు సంధించిన మంత్రి కాకాణి… సోమిరెడ్డికి టికెట్ ఇవ్వడం సంతోషం అన్నారు. వరుసగా నాలుగు సార్లు ఓడిపోయారు.. రెండు జాబితాల్లో చోటు దక్కలేదు.. సీనియర్ నేత అని చెప్పుకొనే సోమిరెడ్డికి.. టికెట్ రావడంతో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.. సోమిరెడ్డికి టికెట్ ఇవ్వకుంటే నేను కూడా ఎన్నికల్లో ఎవరిపై మాట్లాడాలా అని అనుకున్నాను అన్నారు. కొత్తవాళ్లైతే విమర్శలు చేయడం కష్టం.. ఇక నా ఎన్నికల ప్రసంగాలు కూడా రంజుగా ఉంటాయి వ్యాఖ్యానించారు. మరోవైపు.. ఇదే చివరి ఎన్నిక అని సోమిరెడ్డి చెబుతున్నారు.. అంటే ఓటు వేస్తే వేయండి.. లేకుంటే లేదని అంటున్నారు అని ఎద్దేవా చేశారు. అయితే, ఆయనను ఎన్నికల్లో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు మంత్రి కాకాణి.
Also Read
- Lionel Messi: ఫుట్‌బాల్ ప్రపంచంలో శకం సమాప్తం.. అర్జెంటీనా దిగ్గజం మెస్సీ రిటైర్మెంట్..
- Putin: రష్యా అధ్యక్షుడు షాకింగ్ నిర్ణయం.. కాన్వాయ్ ఆపి ఫొటోలు దిగిన పుతిన్.. వీడియో వైరల్
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్‌రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
ఇక, రాజకీయంగా పరిణితి చెందిన సోమిరెడ్డి.. జిల్లా అధికారులపై తీవ్ర విమర్శలు చేయడం సరికాదు అని హితవుపలికారు కాకాణి.. సైదాపురంలో అక్రమ గనుల తవ్వకాలపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తాన్నారు.. దమ్ముంటే సీబీఐ విచారణ కోరాలి అని సూచించారు. అక్రమ మైనింగ్ పై విచారణ జరపాలని నేను ప్రభుత్వానికి లేఖ రాశా.. సైదాపురంలో గనుల యజమానుల వద్ద సోమిరెడ్డి ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. పొదలకూరులో 500 కోట్ల విలువైన తెల్లరాయిని తవ్వి స్టాక్ చేసారని సోమిరెడ్డి ఆరోపించారు. రూ.5 కోట్లు ఆయన చెల్లిస్తే.. ఆ స్టాక్ ఇచ్చేలా ప్రభుత్వం.. ఎన్నికల సంఘాన్ని కోరుతా.. దీనికి సోమిరెడ్డి సిద్ధమా? అని సవాల్ చేశారు. అక్రమ మైనింగ్ పై విచారణ కు రావాలి.. యాష్ పాండ్ లో కాంట్రాక్టర్ల నుంచి ముడుపులు తీసుకున్నారన్న ఆయన.. గతంలో ఆయన మద్దతుదారులు ఇసుకను అక్రమంగా రవాణా చేశారు.. కోర్టులో దొంగతనం పై సీబీఐ విచారణ నేను కోరాను, ఆ కేసులో సీబీఐ నా పాత్ర లేదని తేల్చింది.. దీనిని కూడా సోమిరెడ్డి సహించలేకపోతున్నారని మండిపడ్డారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.
తాజావార్తలు
-
Nag Ashwin : దుల్కర్ ‘ఐ యామ్ గేమ్’లో మైండ్ బ్లాంక్ అయ్యే సీక్రెట్ లీక్ చేసిన నాగ్ అశ్విన్!
-
Lionel Messi: ఫుట్‌బాల్ ప్రపంచంలో శకం సమాప్తం.. అర్జెంటీనా దిగ్గజం మెస్సీ రిటైర్మెంట్..
-
Putin: రష్యా అధ్యక్షుడు షాకింగ్ నిర్ణయం.. కాన్వాయ్ ఆపి ఫొటోలు దిగిన పుతిన్.. వీడియో వైరల్
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్‌రెడ్డి
-
Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!