Somireddy Chandramohan Reddy: ఏపీ సీఎం వైఎస్ జగన్.. కుట్రలు చేస్తారు, కుతంత్రాలు చేస్తారు.. కుటుంబంలో చిచ్చు పెడతారు అంటూ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రంలోని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి.. తల్లి, చెల్లికి కూడా న్యాయం చేయలేని వ్యక్తి వైఎస్ జగన్ అంటూ మండిపడ్డారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.. నెల్లూరులో మీడియతో మాట్లాడిన ఆయన.. తన తల్లి విజయమ్మ.. చెల్లి షర్మిలను తెలుగుదేశం పార్టీనే తనకు దూరం చేసిందని వైఎస్ జగన్ అంటున్నారు.. తల్లిని, చెల్లిని మేం దూరం చేశామా? అని ప్రశ్నించారు. తల్లి.. చెల్లికి కూడా న్యాయం చేయలేని వ్యక్తి జగన్ అని విమర్శించినా ఆయన.. జగన్ మాటలకి సిగ్గూ.. శరం లేదని ఫైర్ అయ్యారు. ఎవరినీ శత్రువులుగా చూడకూడదు.. అందరినీ సమానంగా చూడాలని క్రిస్మస్ రోజున జగన్ సందేశం ఇవ్వడం విడ్డూరం అన్నారు. ఎవరినీ శత్రువులుగా చూడకూడదని చెబుతాడు. మా అందరిపైనా అక్రమ కేసులు పెట్టి వేధిస్తాడు.. ఇది ఆయన నైజం అంటూ సీఎం వైఎస్ జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.
ఇక, సర్వేపల్లి నియోజకవర్గంలో రెవెన్యూ శాఖ మంత్రి కాకాని చెప్పినట్లు నడుస్తోందని విమర్శించారు సోమిరెడ్డి.. జాతీయ రహదారి పక్కన వందల కోట్ల రూపాయల విలువైన భూమిని బినామీ పేర్లతో మంత్రి కాకాణి దోచుకుంటున్నారు. వెంకటాచలంలో తహసిల్దారుగా పనిచేసిన ప్రసాద్ అనే అధికారి రికార్డులను మార్చే శారు. గ్రామ సభలు పెట్టకుండా పట్టాలు ఇచ్చారు.. ప్రస్తుతం ఆయన సస్పెన్షన్ లో ఉన్నారు.. సమాచార హక్కు చట్టం కింద జాయింట్ కలెక్టర్ ఇచ్చిన రికార్డుల ఆధారంగానే మాట్లాడుతున్నాను అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరులో పనిచేసిన తహసిల్దార్ కూడా సస్పెండ్ అయ్యారు. మంత్రి కాకాని కింద రెవెన్యూ శాఖ అని నలిగిపోతోంది.. భూములకు సంబంధించిన వివరాలను ఆయా కార్యాలయాల్లో అధికారులు ప్రదర్శించాలి అని డిమాండ్ చేశారు. పది రోజుల్లో అధికారులు స్పందించకపోతే కలెక్టరేట్ ను ముట్టడిస్తాం అని హెచ్చరించారు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.
Read Also: Pannun murder plot: ఖలిస్తానీ పన్నూ కేసులో నిఖిల్ గుప్తా పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు..