TDP vs YS Jagan: జగన్ ట్వీట్.. టీడీపీ కౌంటర్ ఎటాక్
- ఈవీఎంలపై వైఎస్ జగన్ చేసిన ఎక్స్ పోస్ట్ (ట్వీట్)కు టీడీపీ కౌంటర్
- జగన్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు.. ఏపీ ఎలన్ మస్క్ లా జగన్ మాట్లాడుతున్నాడు అంటూ సోమిరెడ్డి సెటైర్లు
- గెలిస్తే తన గొప్ప.. ఓడితే ఈవీఎంల తప్పా..? అని నిలదీత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP vs YS Jagan: ఈవీఎంలపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన ఎక్స్ పోస్ట్ (ట్వీట్)కు కౌంటర్ ఎటాక్‌కు దిగారు టీడీపీ నేతలు.. జగన్ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. జగన్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు.. ఏపీ ఎలన్ మస్క్ లా జగన్ మాట్లాడుతున్నాడు అంటూ సెటైర్లు వేశారు.. గెలిస్తే తన గొప్ప.. ఓడితే ఈవీఎంల తప్పా..? అని నిలదీశారు.. 2019 ఎన్నికల్లో తాను గెలిచినప్పుడు ఈవీఎంల గురించి తానేం మాట్లాడాడో జగన్ ఓసారి గుర్తు చేసుకోవాలని సూచించారు. పరనింద.. ఆత్మ స్తుతి మాని ఇకనైనా జగన్ ఆత్మ విమర్శ చేసుకోవాలని సలహా ఇచ్చారు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.
ఇక, జగన్ రెడ్డి నీకు 151 సీట్లు వచ్చినప్పుడు అది మీ విజయమా..? అదే మాకు 164 సీట్లు వస్తే ఈవీఎంల గురించి మాట్లాడుతావా..? అంటూ ట్విట్టర్‌లోనే నిలదీశారు టీడీపీ నేత బుద్దా వెంకన్న.. జగన్ పులివెందులకు రాజీనామా చేస్తే.. బ్యాలెట్ పేపర్ విధానంలో ఉప ఎన్నిక పెట్టమని అందరం ఈసీని కోరదాం… ఆ ఉప ఎన్నికల్లో అసలు గెలుస్తావో లేదో..? మొన్న వచ్చిన మెజారిటీ అయినా వస్తుందో రాదో, చూద్దాం..! అంటూ సవాల్ చేశారు. ఇకనైనా జగన్ చిలక జోస్యం ఆపాలి అంటూ ఎద్దేవా చేశారు బుద్దా వెంకన్న..
Also Read
- Ram Lakshman Masters: 'ది ప్యారడైజ్' సెట్స్‌లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
- Oracle Layoffs: ఏఐ డేటా సెంటర్ల కోసం భారీ ఖర్చు.. ఒరాకిల్‌లో మరోసారి పెద్ద ఎత్తున లేఆఫ్స్..?
- Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్‌డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
- Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
కాగా, ఈవీఎంల విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన మాజీ సీఎం వైఎస్ జగన్.. ”న్యాయం కేవలం జరిగినట్లు కనిపించడం కాదు.. నిజంగా జరగాలి. అలాగే ప్రజాస్వామ్యం అనేది బలంగా ఉండటమే కాకుండా నిస్సందేహంగా ప్రబలంగా ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల పద్ధతుల్లో.. దాదాపు అభివృద్ధి చెందిన ప్రతీ ప్రజాస్వామ్య దేశంలోనూ పేపర్ బ్యాలెట్లే వాడుతున్నారు. ఈవీఎంలను ఉపయోగించడం లేదు. ఈవీఎంల బదులు పోస్టల్ బ్యాలెట్లను ఉపయోగించాలి.. మన ప్రజాస్వామ్యం నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో మనం కూడా అదే దిశగా పయనించాలి. ” అంటూ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేసిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Ram Lakshman Masters: ‘ది ప్యారడైజ్’ సెట్స్‌లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
-
Oracle Layoffs: ఏఐ డేటా సెంటర్ల కోసం భారీ ఖర్చు.. ఒరాకిల్‌లో మరోసారి పెద్ద ఎత్తున లేఆఫ్స్..?
-
Casting Couch: ‘నువ్వు నాతో గడపాలనుకుంటే’… డైరెక్టర్ కు షరతు పెట్టిన నటి.. ఆ తరువాత ఏం జరిగిందో తెలిస్తే..
-
Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్‌డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
-
Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!