Kakani Govardhan Reddy: సోమిరెడ్డిపై కాకాణి సెటైర్లు.. టికెట్ ఇవ్వకపోతే చంద్రబాబు, పవన్‌పై కూడా ఫిర్యాదు చేస్తారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakani Govardhan Reddy: ప్రభుత్వ అధికారులపై పోలీసులకు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఫిర్యాదు చేయడంపై సెటైర్లు వేశారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. అభివృద్ధి. సంక్షేమం ప్రాధాన్యాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని తెలిపారు. నెల్లూరు నగరంలో పలు ప్రభుత్వ కార్యాలయాలకు నూతన భవనాలను నిర్మించామని.. కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని కూడా త్వరలోనే చేపడతాం అన్నారు. అయితే, ప్రభుత్వ అధికారులపై పోలీసులకు సోమిరెడ్డి ఫిర్యాదు చేయడం సరికాదని హితవుపలికారు. పొదలకూరులో మైనింగ్ చేస్తున్న వారి నుంచి టన్నుకు రెండు వేల రూపాయలు ఆయన డిమాండ్ చేశారని ఆరోపించారు. అది ఇవ్వనందుకే నానా హడావిడి చేస్తున్నారు.. సైదాపురం మండలంలో అక్రమ మైనింగ్ లో నా పాత్ర ఉందని ఆరోపించారు.. మరి ఇప్పుడెందుకు ఆ మండలం గురించి మాట్లాడటం లేదు అని ప్రశ్నించారు.
Read Also: Lok Sabha Election 2024: ఇండియా కూటమిలో సీట్ల పంపకంపై కాంగ్రెస్ కీలక నిర్ణయం
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ఇక, వచ్చే ఎన్నికల్లో సర్వేపల్లి అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోతే టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కూడా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేస్తారు అని ఎద్దేవా చేశారు మంత్రి కాకాణి.. మరోవైపు.. ముత్తుకూరు మండలంలో ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థ యాష్ పాండ్ నిర్మిస్తుంటే హడావిడి చేశారన్న ఆయన.. వాళ్ల నుంచి మామూళ్లు తీసుకున్నారని ఆరోపించారు. ఒక సబ్జెక్ట్ తీసుకుని అందులో తన వాటా వచ్చిన తర్వాత మరో సబ్జెక్టు లోకి వెళ్లడం సోమిరెడ్డికి అలవాటే అని విమర్శలు గుప్పించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తెలిపారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!