Student Cheated: దేశవ్యాప్తంగా సైబర్ నేరాల సంఘటనలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. దింతో ప్రజలు సంవత్సరాల తరబడి సంపాదించిన డబ్బును నిమిషాలల్లో కోల్పోతున్నారు. ఇటీవలి కాలంలో రాజస్థాన్‌లో కూడా సైబర్ ముఠాలు చాలా యాక్టివ్‌గా మారాయి. భరత్పూర్ జిల్లాలోని డీగ్ నగరం ఈ నేరాలకి చాలా ప్రసిద్ధి చెందింది. అయితే, ఇప్పుడు దుండగులు ఇతర జిల్లాల్లో కూడా విస్తరిస్తున్నారు. తాజాగా అజ్మీర్ జిల్లాలో 11వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి దాదాపు 200 మందిపై సైబర్ మోసానికి…
Raging In Collage: నోయిడాలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీ క్యాంపస్‌లో జూనియర్ విద్యార్థులపై ర్యాగింగ్ దాడి ఘటన వెలుగు చూసింది. అందిన సమాచారం ప్రకారం.. ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా జూనియర్ విద్యార్థులు నిరసన తెలపడంతో సీనియర్లు వారిని కొట్టారు. బాధిత విద్యార్థి సెక్టార్ -39 పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులో భాగంగా గత నెలలో రాత్రి 3 గంటల సమయంలో కొంతమంది సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేసి కొట్టారని ఆరోపించారు. ఫిర్యాదు ప్రకారం…
AP Home Minister: అసభ్య పోస్టులు పెట్టిన వారిపై పలు కేసులు నమోదు అయ్యాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. వైసీపీ నేతలు ఈ కేసులపై గగ్గోలు పెడుతున్నారు.. సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెడుతున్నారో వాళ్ళకు తెలుసా అని అడిగారు.
సోమిరెడ్డి చేసిన అవినీతి గురించి వాట్సాప్ లో పోస్ట్ పెట్టడంతోనే నా పైనా కేసు పెట్టారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, విచారణ సందర్భంగా పోలీసులు దాదాపు 54 ప్రశ్నలు అడిగారని పేర్కొన్నారు. ఇక, మద్యం, ఇసుకలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు దోచుకుంటున్నాడు అని మాజీ కాకాణి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు.
వైసీపీ సోషల్ మీడియాపై కేసులు పెట్టడాన్ని మాజీ ఎంపీ మార్గాని భరత్ ఖండించారు. టీడీపీ- జనసేన చేసిన సోషల్ మీడియా పబ్లిసిటీలో వైసీపీ ది 10 శాతం కూడా లేదన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల వాక్ స్వాతంత్రపు హక్కును హరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం చేసే తప్పులు గురించి మాట్లాడకూడదా.. ఇదేమన్నా ఎమర్జెన్సీ పాలనా అంటూ ప్రశ్నించారు.
ఒడిశాలోని జగత్సింగ్పూర్ జిల్లాకు చెందిన ఓ మహిళతో లవ్ జిహాద్ ఉచ్చులో పడింది. ఆమె సోషల్ మీడియా ద్వారా ఒకరితో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకోవడం ప్రారంభించారు. ఆ తర్వాత నిందితుడు ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఈ సందర్భంగా అసభ్యకర వీడియోలు కూడా రూపొందించాడు. మతం మారి వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. బాధిత మహిళ దీనిని ఖండించడంతో, వీడియోలు వైరల్ అయ్యాయి. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఈ క్లిప్‌లో ఒక భవనం కూలినట్లు చూడొచ్చు. బెంగళూరులోని కేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్)లో కొన్ని సెకన్ల వ్యవధిలో భవనం నేలమట్టమైంది. స్థానికుల కథనం ప్రకారం.. భవనంలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. దీని కారణంగా భవనంలో భారీ పగుళ్లు పడ్డాయి.
ప్రస్తుతం ఎంతో మంది తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునేందుకు ఆరాటపడుతున్నారు. అందుకోసం ప్రమాదకర స్టంట్లు చేస్తూ.. లైకుల కోసం ప్రాణాలకు తెగిస్తున్నారు. ఫాలోవర్స్ మోజులో కొందరు యువకులు డేంజరస్ స్టంట్స్ చేస్తున్నారు. ప్రాణాలతో చెలగాడం ఆడుతున్నారు.
పులివెందుల ఎమ్మెల్యే నోటి నుంచీ వినకూడని మాటలు వస్తున్నాయని హోంమంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. రాజకీయాలలో ఎవరున్నా.. మా కుటుంబ సభ్యులను సైతం నీచంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతి మహిళా రైతులు మానసిక క్షోభకు గురయ్యారన్నారు.