Lions Attack Cow:గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలోని 11 తాలూకాల్లో సింహాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తరుచుగా వేట కోసం తరచూ వచ్చి వెళ్తుంటాయి. ఈ నేపథ్యంలో, తాజాగా నాలుగు సింహాలు రాత్రి వేట కోసం జిల్లాలోని రాజులాలోని పిపావావ్ పోర్ట్ ప్రాంతానికి వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రాత్రి వేటలో వెతుకులాటకు బయలుదేరిన సింహాలు ఎద్దును వేటాడేందుకు ప్రయత్నించినట్లు వీడియోలో చూడవచ్చు. ఇంతలో ఎద్దు సింహాలను ఎదుర్కొంది. అంతేకాదు ఆ ఎద్దు ఆ అవకాశాన్ని చూసి ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడి నుంచి చాలా తెలిపివిగా పారిపోయింది. ఈ ఘటన మొత్తాన్ని స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి కెమెరాలో బంధించాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
પીપાવાવ પોર્ટ પાસે આખલાને ઘેરી 4 સિંહ શિકારનો પ્રયાસ કરતા નજરે પડ્યા #amreli #Lions #gir #gujarat #ViralVideos pic.twitter.com/kTz1WsJoQJ
— Hasmukh Ramani (@Ramani_Has) November 18, 2024
ఇకపోతే, మరో వీడియోలో రోడ్డుపై కూర్చొని సింహాలు గర్జిస్తున్నాయి. ధారి తాలూకాలోని మోర్జార్ నుండి మానవ్‌దార్ రహదారిపై మూడు సింహాలు రోడ్డుపై కూర్చుని గర్జించాయి. ఈ సింహ గర్జన వింటే కచ్చితంగా ఉల్లిక్కి పడాల్సిందే. సమాచారం ప్రకారం అమ్రేలి జిల్లాలో సింహాల సంఖ్య ఎక్కువగా ఉంది. షెరాన్ కుటుంబం అమ్రేలి జిల్లాలోని 11 తాలూకాలలో నివసిస్తుంది. అమ్రేలి జిల్లాలో సింహాలు పగలు, రాత్రి వేటలో తిరుగుతున్నాయి. ఇక్కడ, సింహాలు తరచుగా రాత్రి లేదా పగలు సమయాలలో వీధుల్లో తిరుగుతూ కనిపిస్తాయి.
આ ડણક 🔥🦁
અમરેલીના ધારી નજીક સિંહોએ રસ્તો રોકીને ગર્જના કરી..! #Amreli #Gir pic.twitter.com/ABqCmiHYB9
— Sagar Patoliya (@kathiyawadiii) November 18, 2024
వైరల్ అవుతున్న వీడియోలలో మొదటి వీడియో అమ్రేలి జిల్లాలోని ధారి తాలూకాలోని మోర్జార్ నుండి మానవదర్ రోడ్డు వరకు సింహాలు విశ్రాంతి తీసుకుంటున్నట్లు అర్థమవుతుంది. మరో వీడియో అమ్రేలి జిల్లాలోని రాజులా పిపావావ్ ఓడరేవు తీర ప్రాంతంలోనిది. సింహాలు ఆహారం కోసం పిపావావ్ ఓడరేవుకు చేరుకున్న సమయంలో ఎద్దును వేటాడాయి. కాకపోతే, సింహాలు విఫలమయ్యాయి.