అడవికి రాజు సింహం. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. సింహానికి ఆకలేస్తేనే వేటాడుతుంది తప్పించి పులి, ఇతర కౄరమృగాల మాదిరిగా వేటాడి ఆహారాన్ని దాచుకోదు. అందుకే సింహం ఆకలిగా ఉన్నప్పుడు దానికి ఎదురుగా వెళ్లాలి అంటే భయపడే జంతువులు, కడుపు నిండిన తరువాత సింహం పక్కకు వెళ్లి నిలబడుతుంటాయి. అంతెందుకు సింహంతో కలిసి పక్కపక్కనే నిలబడి నీళ్లు తాగుతుంటాయి. ఇలానే, ఓ సింహం, దానిపక్కనే జీబ్రా నిలబడి నీళ్లు తాగుతున్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. ఇంకేముంది…
ప్రపంచంలో ఎక్కువ మంది పిజ్జాలు తింటుంటారు. ప్రతిరోజూ కోట్లాది పిజ్జాలను ప్రజలు ఆర్డర్ చేస్తుంటారు. భూమి మీద ఎలా ఉన్నా, అంతరిక్షంలోని స్పేస్ స్టేషన్లో ఉండే వ్యోమగాములు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే, అక్కడ వారు వీలైనంత తక్కువగా ఆహారం తీసుకోవాలి. భారరహిత స్థితిలో ఉంటారు. పైగా అరుగుదల చాలా తక్కువగా ఉంటుంది. వీటన్నింటిని పక్కన పెట్టి భూమిపై ఉంటే ఎలాగైతే పార్టీ చేసుకుంటారో అదే విధంగా అంతరిక్ష కేంద్రంలో కూడా పిజ్జా పార్టీ…
కరోనా మహమ్మారి నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఇప్పటికీ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. వేగంగా కేసులు విస్తరిస్తుండటంతో ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. మాస్క్ ధరించడం తప్పని సరి అని చెబుతున్నా, ప్రజలు ఆ మాటలు నెత్తికెక్కించుకోవడం లేదు. నాయకులే మాస్కులు పక్కన పెట్టి సభలు, సమావేశాలు, యాత్రలు చేస్తున్నారు. రాజు చూపిన బాటలోనే కదా ప్రజలు నడిచేది. అందుకే ప్రజలు కూడా అలానే చేస్తున్నారు. అయితే, మనుషుల కంటే తానే బెటర్ అని చెప్పకనే చెప్పింది…
ఇందిరాపార్క్ లో ఉదయం, సాయత్రం సమయాల్లో పెద్ద సంఖ్యలో నగరవాసులు వాకింగ్ చేసేందుకు వస్తుంటారు. అయితే, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు సామాన్యప్రజలకు ప్రవేశం ఉంటుంది. ఇందిరా పార్క్‌కు ఎక్కువగా ప్రేమ జంటలు వస్తుంటాయి. అయితే, గత కొంతకాలంగా ఈ పార్క్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతుండటంతో పార్క్ యాజమాన్యం గేటు ముందు ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. పెళ్లికాని జంటలకు ప్రవేశం లేదని ఆ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. దీంతో నెటిజన్లు ఈ ఫ్లెక్సీపై…
ఇప్పటి వరకు మనం డ్రోన్ కెమెరా ద్వారా వీడియో షూటింగ్ చూసి ఉంటారు. పారాచూట్లో వెళ్తూ షూటింగ్ చేయడం చూసుంటారు. కాని, చిలుక ఎగురుతూ వీడియో తీయడం ఎప్పుడైనా చూశారా అంటే లేదని చెప్తాం. చిలుక మాట్లాడుతుందని తెలుసుగాని, ఇలా వీడియోను షూట్చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ఓ వ్యక్తి తన మొబైల్‌ను చూసుకుంటుండగా చిలుక అమాంతంగా ఆ మొబైల్ ఫోన్‌ను ఎత్తుకు పోయింది. అయితే ముక్కుకు ఫోన్‌ను కరుచుకుపోవడంతో వీడియో మోడ్ ఆన్ అయింది. అంతే…
ప్రముఖ నటుడు… అంతకు మించిన మానవతా మూర్తి సోనూసూద్ ను అభిమానించే వారి, అనుసరించేవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. స్నేహితుల విలువ కష్టకాలంలోనే తెలుస్తుందని పెద్దలు చెబుతుంటారు. అలా కరోనా కష్టకాలంలో తనకు తెలిసి వారికి, తెలియని వారికి కూడా స్నేహహస్తాన్ని అందించి మిత్రుడిగా మారిపోయాడు సోనూసూద్. అతను, అతని బృందం రాత్రింబవళ్ళు కష్టపడి వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చారు. అయితే అంతటితో తన మిషన్ ను సోనూసూద్ ఆపేయలేదు. నిజానికి ఆ తర్వాతే అతను…
సముద్రంలో వింత వింత జీవులు ఎన్నో ఉంటాయి. మహాసముద్రాల్లో మనకు కనిపించే జీవుల కంటే కనిపించని జీవులు కోట్ల సంఖ్యలో ఉంటాయి. అవి అప్పుడప్పుడు అరుదుగా బయటకు వచ్చి షాక్ ఇస్తుంటాయి. ఇక డాల్ఫిన్లు మనుషులతో ఎంత మమేకం అవుతాయో చెప్పక్కర్లేదు. డాల్ఫిన్లలో తెలుపు, గ్రే కలర్ డాల్ఫిన్లు ఎక్కువగా మనకు కనిపిస్తుంటాయి. అయితే, ఇప్పుడు అత్యంత అరుదైన పింక్ డాల్పిన్లు సముద్రంలో కనిపించాయి. వాటిని చూసి అంతా షాకవుతున్నారు. ఇది నిజమా కాదా అని సందేహిస్తున్నారు.…
చిన్నపిల్లలు ఆలూ చిప్స్ ను ఇష్టంగా తింటుంటారు. ప్రతి ఇంట్లో సరుకుల లిస్ట్‌లో ఆలూ చిప్స్ ఉండాల్సిందే. ఆస్ట్రేలియాకు చెందిన రైలీ అనే 13 ఏళ్ల చిన్నారికి డోరిటోస్ చిప్స్ అంటే చాలా ఇష్టం. వాటిని ఇష్టంగా తింటుంది. అయితే, ఓ రోజు రైలీ తండ్రి ఆమెకు డోరిటోరిస్ ప్యాకెట్ కొనిచ్చారు. దానిని ఒపెన్ చేసింది. అందులో ఒక ఆలూ చిప్స్ చాలా అకట్టుకుంది. ఆ ముక్క బాగా ఉబ్బి సమోసా మాదిరిగా ఉన్నది. మొదట తినాలి…
కరీంనగర్ లో సోషల్ మీడియా దుర్వినియోగం అవుతుంది అని కరీంనగర్ శాంతి భద్రతల అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. తాజాగా మాట్లాడిన ఆయన కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో సోషల్ మీడియా పై ప్రత్యేక నిఘా ఉంచగా అందులో భాగంగా గన్ తో దిగిన ఫోటో కనుగొన్నారు పోలీసులు. టాస్క్ ఫోర్స్ ప్రత్యేక నిఘాలో ఫోటో దిగిన వ్యక్తిని గుర్తించారు. అతను కరీంనగర్ గోదాం గడ్డకు చెందిన గడ్డం కృష్ణగా గుర్తించిన పోలీసులు తర్వాత ఆ ఫోటోలో ఉన్నది…
సూపర్ మార్కెట్లో అప్పుడప్పుడు వింత సంఘటనలు జరుగుతుంటాయి. ఓ సముద్రపు పక్షి సూపర్ మార్కెట్ వద్దకు వెళ్లి నిలబడి గ్లాస్ డోర్ తెరుచుకోగానే లోపలికి ప్రవేశించి చిప్స్ ప్యాకెట్ ను ఎత్తుకొచ్చింది. అలానే ఓ మొసలి సూపర్ మార్కెట్లోకి ప్రవేశంచి గందరగోళం సృష్టించింది. ఇప్పుడు ఓ భారీ పైతాన్ సూపర్ మార్కెట్ లోపలికి వచ్చి హడావుడి చేసింది. ఈ కొండచిలువ దెబ్బకు కస్టమర్లు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ సంఘటన ఆస్ట్రేలియాలోని సిడ్నీ సూపర్ మార్కెట్లో…