భరతనాట్యం చేస్తున్న ఇద్దరు బాలికల వెనుక ఏనుగు డ్యాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇద్దరు అమ్మాయిలు కెమెరా ముందు క్లాసికల్ డ్యాన్స్ స్టెప్పులు వేస్తున్నారు. వారితో పాటు అమ్మాయిల వెనక నిలబడి ఉన్న ఏనుగు డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. కేవలం మనుషులు మాత్రమే సంగీతాన్ని ఆస్వాధించడం కాదు.. పెంపుడు జంతువులు కూడా సంగీతాన్ని ఆస్వాధిస్తాయని ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది.
వీడియో ప్రకారం.. ఈ వీడియోలో ఇద్దరు అమ్మాయిలు ఓ పాటకు నృత్యం చేస్తున్నారు. వారి వెనుక ఓ ఏనుగు నిలబడి ఉంది. అమ్మాయిల డ్యాన్స్‌ను చూసిన ఏనుగు ఎంజాయ్ చేయడం ప్రారంభించింది. ఆ ఏనుగు కూడా ఆ అమ్మాయిలతో కలిసి స్టేప్పులేసింది. ఈ వీడియో జనాలను బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం నెట్టింట హాల్చల్ చేస్తోంది. అయితే.. అమ్మాయిల కన్నా ఆ ఏనుగు డ్యాన్స్ చాలా ఫేమస్ అయ్యింది.
READ MORE:Madhya Pradesh: మైనర్ బాలికపై అంబులెన్స్‌లో సామూహిక అత్యాచారం..
సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో @sankii_memer హ్యాండిల్ నుంచి షేర్ చేయబడిన ఈ క్లిప్‌ను ఇప్పటివరకు దాదాపు 9 లక్షల మందికి పైగా వీక్షించారు. క్యాప్షన్‌లో “ఇద్దరు అమ్మాయిలు భరతనాట్యం చేస్తుండగా.. వెనుక నిలబడి ఉన్న ఏనుగు వారిని చూసి నృత్యం చేయడం ప్రారంభించింది.” అని రాసుకొచ్చారు. ఈ 15 సెకన్ల క్లిప్‌ని నెటిజన్లు ఎంతగానో లైక్ చేయడంతో కొన్ని గంటల్లోనే పోస్ట్‌కి లైక్‌లు, కామెంట్‌లు వెల్లువెత్తాయి. అయితే దీన్ని ఏనుగు నృత్యంగా భావించి జనాలు మైమరిచిపోతున్నారు.
READ MORE:Telangana: గురుకులాలు, హాస్టళ్లలో ఇకపై ఫుడ్ సేఫ్టీ కమిటీలు..
ఈ వీడియోలో ఏనుగు డ్యాన్స్ చేయడం లేదని, ఒత్తిడిలో ఉందని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారులు పేర్కొంటున్నారు. ఏనుగు ఒత్తిడిలో ఉందని ఐఎఫ్‌ఎస్ పర్వీన్ కస్వాన్ ట్వీట్ చేశారు. ఇది నృత్యానికి సంకేతం కాదు, ఒత్తిడికి సంకేతమని తెలుపుతున్నారు.
— Bhoomika Maheshwari (@sankii_memer) November 26, 2024