సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత ఫ్యాషన్ పిచ్చి రోజురోజుకు ముదిరిపోతున్నది. రకరకాల ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకొని ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తు పాపులర్ అవుతున్నారు. గతంలో కండోమ్స్‌తో డ్రెస్సులతో కొందరు పాపులర్ కాగా, ఖాళీ కేఎఫ్‌సీ బకెట్ లతో చేసిన డ్రెస్ వేసుకొని ట్రెండింగ్‌లో నిలిచారు.
ఇప్పుడు చిప్స్ ప్యాకిట్స్‌తో శారీని ధరించి ఓ యువతి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. ఖాళీ చిప్స్ ప్యాకెట్లను కట్ చేసి వాటితో శారీని తయారు చేశారు. ఆ శారీని ఓ మహిళ ధరించిన ఫ్యాషన్‌గా నడుస్తున్న దృశ్యాలను షూట్ చేసి ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజర్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. చీరకు అంటుకున్న ఆయిల్ జిడ్డు ఎలా వదలగొట్టుకోవాలని కొందరు ప్రశ్నిస్తే, వినాశ కాలే విపరీత బుద్దీ అంటూ కొందరూ తిట్టిపోస్తున్నారు. ఏదైతేనేం చిప్ప్ ప్యాకెట్స్ చేసిన ఈ శారీ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.
Read: పైలట్‌కు ఆ ప్రభుత్వం నోటీసులు… రూ. 85 కోట్లు చెల్లించాలని డిమాండ్…