Nara Lokesh : సామాజిక మాధ్యమం ఎక్స్‌లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురించి మంత్రి నారాలోకేష్ ఆశక్తి కర ట్వీట్ చేశారు. భారతదేశం మన్మోహన్ సింగ్ అస్తమయంపై శోకసంద్రంలో మునిగిన సమయంలో ఆయన మా కుటుంబం పట్ల చూపిన ప్రేమను గుర్తు చేసుకోవాలంటూ నారా లోకేష్ ట్విట్టర్లో పేర్కొన్నారు. అంతేకాకుండా.. ‘2004 మాకు పరీక్షా సమయం. అప్పడు జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారాన్నికోల్పోయింది.. చంద్రబాబు నాయుడుపైనా ఆ ఎన్నికల ముందే భయంకరమైన దాడి అలిపిరి ఘటన…
Donald Trump On Tiktalk: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్, టిక్‌టాక్‌పై నిషేధాన్ని నిలిపివేయాలని సుప్రీం కోర్టును కోరారు. టిక్‌టాక్‌ను నిషేధించే చట్టాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని, సమస్యకు రాజీ పరిష్కారం సాధించేందుకు మరికొంత సమయం కావాలని ఆయన అభ్యర్థించారు. జనవరి 19, 2025 వరకు నిషేధ గడువును పొడిగించాలని ట్రంప్ కోరుతున్నారని తెలుస్తోంది. ట్రంప్ తన మొదటి పదవీకాలంలో టిక్‌టాక్‌ను నిషేధించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే, 2024 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో యువ ఓటర్లను,…
పెళ్లంటేనే సందడి.. హడావుడి ఉంటుంది. బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల రాకతో ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఉంటారు. సామాన్యులు చేసుకున్నా.. భాగ్యవంతులు చేసుకున్నా.. సందడి ఏ మాత్రం తగ్గదు. ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్లు వివాహ ఏర్పాట్లు చేసుకుంటారు.
ప్రస్తుతం అందరూ స్మార్ట్ ఫోన్లకు బానిసలుగా మారుతున్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు చక్కటి సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి . వివాహ బంధాలను బలహీనపరిచి.. భర్తపై భార్య.. భార్యపై భర్త.. అనుమానాలు పెంచుకుంటున్నారు. కొందరైతే చంపేయడానికి కూడా వెనకాడటం లేదు. అలాంటి ఘటనే ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో వెలుగులోకి వచ్చింది. తన భార్య మొబైల్ ఫోన్ అధికంగా వాడిందన్న కారణంతో భర్త ఆమెను రెండో అంతస్తు నుంచి కిందకు తోసేశాడు. ఆమె తీవ్రంగా గాయపడగా.. డీకేఎస్ ఆస్పత్రిలో చేర్పించారు.…
Indian Techie: భారతదేశంలోని ఓ స్టార్టప్ కంపెనీలో తాను వర్క్ చేస్తున్నానని.. తనను జాబ్ లోకి తీసుకున్నాక సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వలేదు.. అలాగే, రోజూ దాదాపుగా 12 నుంచి 15 గంటల పాటు పని చేయాల్సి వస్తోందని ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి వాపోయాడు.
దేశంలో పెద్ద నోట్లు రద్దయి ఏడేళ్లు దాటింది. ఈ నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఎన్నో కేసులు నమోదయ్యాయి. వాటిపై సుదీర్ఘ విచారణ జరిపిన సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. డిమానిటైజేషన్‌ను సమర్థించింది. నోట్ల రద్దు తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గానే ఉంది. కాగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. కొత్త రూ.500, రూ.2000 నోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించిన ఓ టీవీ న్యూస్ ఛానెల్ క్లిప్ సోషల్ మీడియాలో…
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కొత్త హెయిర్ స్టైల్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ట్రంప్ గతంలో కంటే చాలా డిఫరెంట్ స్టైల్లో కనిపిస్తున్నారు. ఆయన లుక్‌కి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఫ్లోరిడాలోని ట్రంప్ యొక్క ప్రైవేట్ ప్రాపర్టీ 'ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ క్లబ్' నుంచి వచ్చింది. ఆయనను మద్దతుదారులు సాదర స్వాగతం పలికారు. ట్రంప్ హృదయపూర్వకంగా ప్రతిస్పందించడం వీడియోలో కనిపిస్తుంది. దీనిని చూసిన నెటిజన్లు స్పందించారు. కాగా.. తాజాగా…
సోషల్ మీడియాలో వైరల్‌గా మారేందుకు కొందరు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. తరచుగా రీల్స్‌లో ఏదో ఒక వింత లేదా భయానక స్టంట్స్ చేయడం చూస్తునే ఉంటాం. కొన్ని వింతగా మరి కొన్ని నవ్వు తెప్పించేవిగా ఉంటాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఒక అమ్మాయి కుక్క పాలు తాగుతున్నట్లు కనిపిస్తుంది. ఈ వీడియోపై జనాలు రకరకాల కామెంట్లు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఎక్స్‌లోని కొన్ని హ్యాండిల్స్ ఈ వీడియో,…
మేడ్చల్ జిల్లాఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగురోడ్డుపై మనీ హంట్ ఛాలెంజ్ పేరుతో డబ్బులు వెదజల్లుతూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్న భానుచందర్ అనే యూట్యూబర్‌ను ఘట్కేసర్ పోలీసులు అరెస్టు చేశారు. అతడిని రిమాండ్‌కు తరలించారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో 'డిజిటల్ మోడల్' చిత్రాలు వైరల్ అవుతున్నాయి. మనకు తగినంత నిద్ర లేకపోతే 2050 నాటికి మనుషులు ఎలా ఉంటారో ఆ చిత్రాల ద్వారా చెబుతున్నారు. బ్రిటిష్ కి చెందిన స్లీప్ ఎక్స్పర్ట్ డాక్టర్ సోఫీ బోస్టాక్ సహాయంతో బెన్సన్స్ ఫర్ బెడ్స్ అనే సంస్థ.. ఈ పరిశోధన చేసింది. స్త్రీ శరీరం సాధారణంగా రాత్రికి ఆరు గంటలపాటు నిద్రపోతే ఆమె 25 ఏళ్లలో ఎలా మార్పు చెందుతోందో డిజిటల్ చిత్రాల ద్వారా తెలిపారు.