TikTok Ban: ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ (TikTok) తన సేవలను అమెరికాలో నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు ఈ విషయాన్ని సందేశాల ద్వారా తెలియజేస్తోంది. జనవరి 19 నుండి టిక్‌టాక్‌పై నిషేధం అమల్లోకి రానుండటంతో, మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘జనవరి 19 నుంచి అమెరికాలో టిక్‌టాక్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం’’ అని టిక్‌టాక్ యూజర్లకు పంపిన సందేశంలో పేర్కొంది. 2017లో ప్రారంభమైన ఈ షార్ట్ వీడియో యాప్‌పై ఇప్పటివరకు…
Pro-Pakistan Slogan: తన సోషల్ మీడియా ఖాతాలో పాకిస్తాన్ అనుకూల నినాదాన్ని పోస్ట్ చేసినందుకు ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, నిందితుడు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ జిల్లా పరిధిలో గల నవాబ్‌గంజ్ ప్రాంతానికి చెందిన ఇమ్రాన్ (25)గా గుర్తించారు.
మంచు వారింట వివాదం ఎన్నో మలుపులు తిరుగుతూ పోతోంది. మంచు మనోజ్, మంచి విష్ణు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటున్న సమయంలో మంచు విష్ణు తన సోదరుడు మనసు మనోజ్ ను రెచ్చగొట్టే విధంగా ఒక డైలాగ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన తండ్రి హీరోగా నటించిన రౌడీ అనే సినిమాలో ఒక డైలాగుని తాజాగా షేర్ చేశారు. ‘’సింహం అవ్వాలి అని ప్రతి కుక్కకి ఉంటుంది కానీ వీధిలో మొరగడానికి అడవిలో గర్జించడానికి…
Bhopal Accident: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు చాలా మంది ట్రై చేస్తూ.. తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ డ్రైవర్ రీల్స్ పిచ్చి వల్ల తనతో పాటు మరో ప్రాణం బలితీసుకున్నాడు.
Delhi Election 2025: ఓటర్ల అభిప్రాయాలను ప్రభావితం చేసే ఏఐ జనరేటెడ్ కంటెంట్ వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని రాజకీయ పార్టీలకు భారత ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
Viral Video: గుజరాత్లో జరిగిన ఓ సంఘటన ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతికి అద్దం పడుతూ, సామాన్యుల ఆగ్రహానికి ఉదాహరణగా నిలిచింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో లంచం తీసుకుంటున్నాడన్న ఆరోపణలపై ఓ ప్రభుత్వ అధికారిపై అక్కడి ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన తీరును చూడవచ్చు. అందిన సమాచారం మేరకు, ఆందోళనకారులు ప్లకార్డులు పట్టుకుని ఆ అధికారిది పని చేసే కార్యాలయానికి చేరుకున్నారు. అధికారిని కళ్లెదుట కూర్చోబెట్టి,…
Maha Kumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు సంబంధించి సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేసే వారిపై యోగి ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. కుంభమేళా నేపథ్యంలో చలితీవ్రత తట్టుకోలేక 11 మంది మరణించారని, చలిని తట్టుకోలేక చాలామంది ఆస్పత్రి పాలవుతున్నారని, అలాగే అక్కడి అధికారులు పట్టించుకోవడం లేదంటూ సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిన లలూ యాదవ్ సంజీవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడు సంజీవ్ సమాజ్‌వాదీ పార్టీకి చెందిన కార్యకర్తగా…
సంక్రాంతి సందర్భంగా ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ముగ్గు వెంకటాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కొత్త రాజకీయ చర్చకు దారితీసింది.. వెంకటాపురం గ్రామంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నటసింహ నందమూరి బాలకృష్ణ, బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు గుర్తుతెలియని వ్యక్తులు.. ఆ దృశ్యాలు కాస్తా సోషల్ మీడియాకు.. ఆ తర్వాత మీడియాకు కూడా ఎక్కడంతో వైరల్‌గా మారిపోయాయి.. సంక్రాతి శుభాకాంక్షలు తెలుపుతూ సైకిల్ గుర్తు, కారు…
దేశాన్ని మరోసారి కొత్త వైరస్ భయపెడుతోంది. చైనాలో ప్రారంభమైన ‘హ్యూమన్ మెటాన్యూమో వైరస్ భారత్‌లోకి కూడా ప్రవేశించింది. సోమవారం ఆయా రాష్ట్రాల్లో ఆరు కేసులు నమోదైనట్లు నివేదికలు పేర్కొన్నాయి.
Adilabad: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రం సమీపంలోని ప్రభుత్వ పోస్ట్ మెట్రిక్ వసతి గృహంలో మద్యం సేవిస్తున్న మందు బాబులు విద్యార్థులతో ఘర్షణకు దిగిన ఘటన కలకలం రేపుతోంది. వసతి గృహ సమీపంలో కొందరు వ్యక్తులు మద్యం సేవిస్తున్నట్టు గమనించిన విద్యార్థులు, ఇక్కడ మద్యం సేవించడం మంచిది కాదని వారిని హెచ్చరించారు. విద్యార్థులు చేసిన పనిని సీరియస్ గా తీసుకున్న మందు బాబులు మద్యం మత్తులో వసతి గృహంలోకి చొరబడి దాడికి తెగబడ్డారు. ఆ తర్వాత…