Delhi Election 2025: ఓటర్ల అభిప్రాయాలను ప్రభావితం చేసే ఏఐ జనరేటెడ్ కంటెంట్ వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని రాజకీయ పార్టీలకు భారత ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో రూపొందించిన చిత్రాలు, వీడియోలు, ఆడియోలపై ఏఐ జనరేటెడ్/ డిజిటల్లీ ఎన్‌హాన్స్‌డ్/ సింథటిక్ కంటెంట్ లాంటి లేబులింగ్ తప్పనిసరి జతచేయాలంటూ నిబంధనను ఈసీ విధించింది.
Read Also: Realme Buds Wireless 5 ANC: సరసమైన ధరలో అదిరిపోయే ఫీచర్స్‌తో వచ్చేసిన రియల్‌మి నెక్‌బ్యాండ్
అయితే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్‌ఫేక్ కారణంగా తప్పుడు సమాచారం ప్రచారంలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ ఇటీవల హెచ్చరికలు జారీ చేశాడు. ఈ తప్పుడు సమాచారం వల్ల ఎలక్షన్ ప్రక్రియపై ఉన్న నమ్మకాన్ని దెబ్బ తీసే ఛాన్స్ ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు గతేడాది లోక్‌సభ ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియా వేదికల వినియోగంపై ఎన్నికల సంఘం మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. కాగా, ఫిబ్రవరి 5వ తేదీన జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు డిజిటల్ ప్రచారకులను నియమించుకున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల డిస్కైమర్లను ఈసీ తప్పనిసరి చేసింది.