మంచు వారింట వివాదం ఎన్నో మలుపులు తిరుగుతూ పోతోంది. మంచు మనోజ్, మంచి విష్ణు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటున్న సమయంలో మంచు విష్ణు తన సోదరుడు మనసు మనోజ్ ను రెచ్చగొట్టే విధంగా ఒక డైలాగ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన తండ్రి హీరోగా నటించిన రౌడీ అనే సినిమాలో ఒక డైలాగుని తాజాగా షేర్ చేశారు. ‘’సింహం అవ్వాలి అని ప్రతి కుక్కకి ఉంటుంది కానీ వీధిలో మొరగడానికి అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలో అయినా తెలుసుకుంటావన్న ఆశ’’ అంటూ తన తండ్రి మోహన్ బాబు చెబుతున్న డైలాగుని షేర్ చేశాడు విష్ణు.
ఇది రౌడీ సినిమాలో తనకు ఫేవరెట్ డైలాగ్ అని చెప్పుకొచ్చారు మొదలుపెట్టి 50 ఏళ్ళు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ డైలాగ్ షేర్ చేసినట్లు పేర్కొన్న విష్ణు ఈ సినిమాలో ఉన్న ప్రతి డైలాగు ఒక స్టేట్మెంట్ అంటూ కామెంట్ చేశారు. అయితే దానికి మంచు మనోజ్ ఘాటు కౌంటర్ ఇచ్చారు. కన్నప్పలో కృష్ణం రాజు గారి లాగా సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది, ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావు అని అంటూ ఒక పోస్టర్ షేర్ చేశారు. అందులో కృష్ణం రాజు నటించిన కొన్ని సినిమాల పోస్టర్స్ ఉన్నాయి. ఇక తన సోదరుడిని పేరు పెట్టి మెన్షన్ చేయకపోయినా అది మంచు విష్ణు గురించే అనే చర్చ జరుగుతోంది.