BC Reservations : తెలంగాణలో బీసీల రిజర్వేషన్లు 42 శాతం పెంచుతూ శాసన సభ ఆమోదించిన బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించాలని ఏప్రిల్ 2న ఢిల్లీలో బీసీ సంక్షేమ సంఘాలు మహాధర్నాకు పిలుపునిచ్చాయి. ఈ మహాధర్నాలో ఏఐసీసీ అగ్రనేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ నేతలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఇతర మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు ఆది…
గెలుపునకు మేమందరం బాధ్యత తీసుకున్నాం.. ఓటమి కూడా సమిష్టి బాధ్యత అని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. బీజేపీ- బీఆర్ఎస్ పార్టీల చీకటి ఒప్పందంలో భాగంగా బీఆర్ఎస్ పూర్తిగా బీజేపీ అభ్యర్థులకు సపోర్ట్ చేసిందని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ హవా చూపిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ సభ్యుల ఓటమిపై ఎంపీ మల్లు రవి ఢిల్లీలో మాట్లాడారు.
Bhatti Vikramarka : సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.. సంక్షేమ శాఖలో పథకాల అమలుకు ఎన్ని నిధులైన ఖర్చు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, సంక్షేమ శాఖల ఫ్రీ బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలు అంశాల పై సమీక్ష నిర్వహించారు. సంక్షేమ హాస్టల్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, గురుకులాలకు సంబంధించి అద్దెలు,…
Minister Seethakka: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. ఈ వ్యాఖ్యల పట్ల తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ మతం, అభిమతం, కుల గణనపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అనవసరమని.. అసలు విషయం నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమని ఆమె పేర్కొన్నారు. రాహుల్ గాంధీ…
Uttam Kumar Reddy : తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రాష్ట్రవ్యాప్త కులగణన సర్వే నివేదికను ఈ రోజు మధ్యాహ్నం రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ అధికారులు కేబినెట్ సబ్ కమిటీకి అందజేశారు. ఈ నివేదికను రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా నేతృత్వంలోని బృందం సచివాలయంలో జరిగిన సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డికి సమర్పించింది. తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక, సామాజిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సంబంధిత…
Delhi : రాజకీయ లాభం కోసం ఎన్నికలకు ముందు ఉచిత పథకాలు అందించడం వంటి వాటికి ప్రస్తుతం చట్టపరమైన నిర్వచనం లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఒక సంవత్సరం నుండి దీనికి సమాధానం కోసం వెతుకుతోంది.
సుపరిపాలన అందించడం వల్లే బీజేపీని వరుసగా మూడుసార్లు ప్రజలు గెలిపించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. బీజేపీని మరో రెండు మూడు సార్లు అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ బీజేపీకి స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు బీజేపీని సమర్థించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం సభలో ఎంపీ పురంధేశ్వరి మాట్లాడారు.
Vijay On Amit shah: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌పై కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై విపక్షాలు నిరసనలు, ఆందోళనలను నిర్వహిస్తున్నాయి. ఈ తరుణంలో తాజాగా తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు విజయ్ కేంద్రమంత్రి వ్యాఖ్యలపై గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆయన ఈ విషయంపై తన సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఇందులో భాగంగా నటుడు విజయ్ ప్రస్తావిస్తూ..…
సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఎస్సీ ఉప-వర్గీకరణపై ఏపీ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ వేసింది. విశ్రాంత ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏకసభ్య కమిషన్ ఈనెల 16 నుండి 19 వరకు వరుసగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ జిల్లాలలో పర్యటించనుంది.
CM Revanth Reddy : దేశవ్యాప్తంగా కుల గణన అనేది కాంగ్రెస్ ఆధ్వర్యంలో సాధించే సామాజిక న్యాయం మూడో ఉద్యమమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధమ ప్రధానమంత్రి పండిట్ నెహ్రూ నుంచి ఇందిరా గాంధీ వరకు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు, బ్యాంకుల జాతీయీకరణ వంటి కార్యక్రమాలతో సామాజిక న్యాయం మొదటి దశ సాధిస్తే… రాజీవ్ గాంధీ హయాంలో 18 ఏళ్లకే ఓటు హక్కు.. మండల్ కమిషన్ నివేదిక వంటి కార్యక్రమాలతో సామాజిక న్యాయం @ 2.0…