గెలుపునకు మేమందరం బాధ్యత తీసుకున్నాం.. ఓటమి కూడా సమిష్టి బాధ్యత అని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. బీజేపీ- బీఆర్ఎస్ పార్టీల చీకటి ఒప్పందంలో భాగంగా బీఆర్ఎస్ పూర్తిగా బీజేపీ అభ్యర్థులకు సపోర్ట్ చేసిందని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ హవా చూపిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ సభ్యుల ఓటమిపై ఎంపీ మల్లు రవి ఢిల్లీలో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవక పోగా, డిపాజిట్లు పోగొట్టుకున్నారని విమర్శించారు. బీజేపీ ఎమ్మెల్సీల సంఖ్య 3 కు పెరిగిందని తెలిపారు. దీనివల్ల ప్రభుత్వానికి, ప్రజలకు ఒరిగేది ఏం లేదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఫలితాలు చూపించి సంబురాలు చేస్తుంటే, ఆశ్చర్యంగా ఉందన్నారు.
READ MORE; Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసం చేశాయని గ్రహించే.. బీజేపీకి పట్ట కట్టారు..
“బీఆర్ఎస్ నేతలపై ఉన్న కేసుల విషయంలో భయపెట్టి, రహస్య ఒప్పందం చేసుకున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇతర ఎన్నికలకు సంబంధం ఉండదు. స్థానిక సంస్థల ఎన్నికలకు, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధం లేదు. రెండు సీట్లు రాగానే, బండి సంజయ్, కిషన్ రెడ్డిలు అన్ని మేమే గెలుస్తాం అంటున్నారు. ఇప్పుడు ఎన్నికలు పెడితే 100 సీట్లల్లో కాంగ్రెస్ గెలుస్తుంది. ఎమ్మెల్యేల కోటాలో కచ్చితంగా సామాజిక న్యాయం ఉంటుంది. ఇన్‌ఛార్జీలు ఎవరు వచ్చినా అందరిది కాంగ్రెస్ సిద్ధాంతమే. గాంధీ సిద్ధాంతాలను మీనాక్షి నటరాజన్ అనుసరిస్తున్నారు.” అని ఎంపీ మల్లు రవి వ్యాఖ్యానించారు.
READ MORE; YS Jagan: ఎక్కడా రాజీ పడొద్దు.. పార్లమెంట్‌లో గట్టిగా గళమెత్తండి.. ఎంపీలకు జగన్ దిశానిర్దేశం