అన్ని వర్గాల సంక్షేమం, సామాజిక సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వే దేశంలోనే ఆదర్శంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే శుక్రవారం నాటికి మరో కీలక మైలు రాయి దాటింది.
కులగణనపై ప్రభుత్వం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. బోయిన్‌పల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో కులగణన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. టైటానిక్ పడవ ను తయారు చేసిన వాళ్ళు ఈ పడవ ప్రపంచంలోనే అత్యంత పెద్దది.. ఇది ఎన్నటికీ మునిగిపోదు అనుకున్నారన్నారు.
CM Revanth Reddy : కులగణనపై ప్రభుత్వం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. బోయిన్‌పల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో కులగణన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కులగణన సంప్రదింపుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని, సామాజిక, ఆర్ధిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, ఉపాధి కుల గణన సర్వే ప్రభుత్వం బాధ్యతగా భావించిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పౌరసమాజం నుంచి సూచనలు తీసుకోవడానికి…
మాదిగ, మాదిగ ఉపకులాల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ సమేళనం నిర్వహించిన నామిడ్ల శ్రీను, వారి బృందానికి నా ధన్యవాదములు తెలిపారు కడియం శ్రీహరి. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. నేను సుప్రీం కోర్ట్ తీర్పు లోబడే నేను మాట్లాడుతానని, షెడ్యూల్ కుల వర్గీకరణను నేను మనసా.. వచా కట్టు పడి వుంటానన్నారు.
బీజేపీ మతోన్మాద, కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా సంక్షేమం, మత సామరస్యం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కోసం అంటూ సీపీఎం అఖిల భారత కమిటీ పిలుపులో భాగంగా తెలంగాణలో నేటి నుంచి జన చైతన్య యాత్ర ప్రారంభం కానుంది.
జగన్ ప్రభుత్వం ఏర్పడి ఇవాళ్టితో మూడేళ్లు పూర్తయింది. ఈ మూడేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలను, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై జగన్ ఫోకస్ పెట్టనున్నారు. మూడేళ్ళ పాలనా సంబరాలను ఘనంగా నిర్వహించనున్నారు పార్టీ నేతలు, పార్టీ శ్రేణులు. తాడేపల్లి పార్టీ హెడ్ క్వార్టర్స్ లో సంబరాలు, పలు సేవా కార్యక్రమాలు చేపడతారు. వీటికి సీనియర్ నేతలు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి, ఇతర నేతలు హాజరవుతారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నేతలు సంబరాలు నిర్వహించనున్నారు. బలహీన వర్గాలకు ప్రభుత్వం…
ఏపీలో వరుస ఛార్జీల పెంపుదలతో సామాన్యులు నానా ఇబ్బందులు పడుతున్నారు. బాదుడే బాదుడు పై వీడియో కాన్ఫరెన్సులో టీడీపీ అధినేత చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రం క్షేమం కోసం టీడీపీకీ అధికారం కావాలన్నారు చంద్రబాబు. టీడీపీకి అధికారం ఇప్పుడు చారిత్రిక అవసరం. రాష్ట్రం మిగిలి ఉండాలంటే.. టీడీపీ అధికారంలోకి రావాలి. https://ntvtelugu.com/pawan-kalyan-assurance-to-koulu-rythulu/ టీడీపీ గెలుపు అనేది కేవలం పార్టీ కోసమే కాదు….రాష్ట్రం కోసం అవసరం. మిగులు విద్యుత్తుగా ఉండే రాష్ట్రంలో ఈ స్థాయి కరెంట్ కష్టాలకు జగన్…