మహిళల క్రికెట్ జట్టులో మిథాలీ రాజ్ తర్వాత కెప్టెన్ ఎవ్వరూ అనే చర్చ మొదలైంది. మిథాలీ స్థానంలో స్మృతీ మంధానను నియమించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. వచ్చే ఏడాది న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే ప్రపంచ కప్ అనంతరం మిథాలీ రాజ్ రిటైర్మెంట్ కానుంది. ఈ నేపథ్యంలో టెస్టులు, వన్డేల్లో మిథాలీ వారసురాలిగా స్మృతీకి ఛాన్స్ ఇవ్వాలని మాజీ కెప్టెన్ శాంతా రంగస్వామి అభిప్రాయపడింది. టీ20జట్టుకు హర్మన్‌ప్రీత్‌కౌర్ నాయకత్వం వహిస్తుంది. కానీ ఆమె బ్యాటింగ్‌లో రాణించలేకపోతుందన్నారు. దీంతో మిథాలీ వారసురాలిగా…
మహిళా క్రికెటర్ స్మృతీ మంధనా గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోయిన్ కి ఈ మాత్రం తీసిపోని అందం స్మృతీ మంధనా సొంతం. ఇన్‌స్టాగ్రామ్‌లో 40 లక్షలకుపైగా ఫాలోవర్లు ఉన్న ఏకైక మహిళా క్రికెటర్ స్మృతి మంధనానే. ఇక తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో తనకిష్టమైన హీరో గురించి చెప్పుకొచ్చింది. తనకు చిన్నప్పటినుంచి బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ అంటే ఇష్టమని తెలిపింది. చిన్నతనంలో పెళ్లి చేసుకొంటే హృతిక్ నే పెళ్లి చేసుకోవాలనుకున్నానని, కానీ,…