విమెన్స్ టీ20 వరల్డ్‌కప్‌లో తొలిసారి ట్రోఫీ గెలిచి తీరాలన్న కసితో ఉన్న టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. భారత జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన గాయం కారణంగా పాకిస్తాన్‌తో జరగబోయే తొలి మ్యాచ్‌లో ఆడేది అనుమానంగా మారింది. ఇటీవల మంచి ఫామ్‌లో ఉన్న మంధాన.. ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేకపోవడం జట్టుకు పెద్దలోటుగా చెప్పవచ్చు. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఈ నెల 12న పాకిస్తాన్‌తో తొలి పోరులో తలపడనుంది హర్మన్‌సేన.
Also Read: Shocking: తన అంత్యక్రియలను తానే చేసుకున్న వృద్ధుడు
ఫిబ్రవరి 8న బంగ్లాదేశ్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో కూడా స్మృతి ఆడలేదు. ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో స్మృతికి చేతి వేలికి గాయమైంది. ఆ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. అదేవిధంగా పాక్‌తో జరిగే మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆడేది కూడా అనుమానంగా మారింది. సఫారీతో జరిగిన ముక్కోణపు సిరీస్ చివరి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ భుజానికి గాయమైంది. ఆమె ఇంకా పూర్తిగా ఫిట్‌గా లేదని సమాచారం. ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు పాక్‌తో మ్యాచ్ నుంచి తప్పుకొంటే టీమిండియాకు కష్టాలు తప్పవు. “స్మృతి మంధాన ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడింది. ఆమె ప్రపంచకప్‌కు దూరమైందని చెప్పలేం. కానీ పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉంది” అని ఐసీసీ వర్గాలు పీటీఐకి తెలిపాయి.
Also Read: INDvsAUS 1st Test: తొలిటెస్టులో టీమిండియా పైచేయి..వైరల్ అవుతున్న మీమ్స్
ఈ టీ20 ప్రపంచ కప్‌లో భారత మహిళల జట్టు గ్రూప్-బిలో ఉంది. ఫిబ్రవరి 12న పాక్ మహిళల జట్టుతో వరల్డ్ కప్ ప్రయాణాన్ని ఆరంభించనుంది. ఫిబ్రవరి 15న వెస్టిండీస్‌తో తలపడనుంది. ఫిబ్రవరి 18న ఇంగ్లండ్‌తో, ఫిబ్రవరి 20న ఐర్లాండ్ మహిళల జట్టుతో తమ గ్రూప్‌లోని చివరి మ్యాచ్ ఆడనుంది భారత్. ఇటీవలె అండర్-19 వరల్డ్ కప్‌ను భారత మహిళల జట్టు గెలుచుకుని చరిత్ర సృష్టించిన విషయం తెలిసింది.
Also Read: Kabaddi: కబడ్డీ ఆటలో కూత పెడుతూ కుప్పకూలిన యువకుడు