తొలి చిత్రం ‘ఉప్పెన’తోనే సూపర్ డూపర్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు మెగా ఫ్యామిలీ యంగ్ హీరో వైష్ణవ్ తేజ్. ఆ తర్వాత వచ్చిన ‘కొండపొలం’ మాత్రం ఈ కుర్రహీరోని తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా ‘రంగ రంగవైభవంగా’ చేస్తున్నాడు. అతి త్వరలోనే ఆ సినిమా జనం ముందుకు రాబోతోంది. ఇదిలా ఉంటే సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సంస్థలు సంయుక్తంగా వైష్ణవ్ తేజ్ తో సినిమాను…
‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మలయాళ చిత్రం తెలుగు రీమేక్ హక్కులు సితార ఎంటర్ టైన్ మెంట్స్ వారు తీసుకున్నారని తెలియగానే, దానిని చూసిన వ్యక్తిగా కోషి పాత్ర తాను చేస్తానని నాగవంశీతో మొదటే చెప్పానని రానా అన్నాడు. ఆ సినిమా తాను చేయాలనుకోవడానికి ఓ స్పెషల్ రీజన్ ఉందని బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించాడు. రెగ్యులర్ చిత్రాలకు భిన్నమైన వాటినే తాను చేయాలనుకుంటానని, ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ కూడా ఓ చిన్న ఇగో క్లాష్ మీద బేస్ చేసి తీసిన…
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతితో వాయిదా పడిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘భీమ్లానాయక్’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారంటూ అభిమానుల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. అసలు ఈవెంట్ ఉంటుందా లేదా అన్న సందేహాలు అభిమానుల్లో కలుగుతున్నాయి. అయితే ఈనెల 23న హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహించేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ వేడుకకు మంత్రులు కేటీఆర్, తలసాని…
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ట్రైలర్ విడుదల తేదీని చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈనెల 21న ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు సితార ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా తెలిపింది. దీంతో శనివారం ట్రైలర్ విడుదల కావడం లేదని తేలిపోయింది. అటు ఈనెల 21న భీమ్లా నాయక్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ పెద్ద ఎత్తున జరగబోతోంది. ఈ వేడుకకు మంత్రి కేటీఆర్‌తో పాటు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా వస్తున్నట్లు చిత్ర…
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారైంది. ఫిబ్రవరి 25న థియేటర్లలో ఈ మూవీని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సినిమాలో రానా విలన్‌గా నటిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అభిమానులకు ఫీస్ట్ అందించనున్నాడు. తమన్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్…
పెద్ద సినిమాలకు లీక్ కష్టాలు తప్పట్లేదు. నిన్న మహేష్ బాబు “సర్కారు వారి పాట” సాంగ్ ఫుల్ గా లీక్ అవ్వడం ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ ఎఫెక్ట్ కారణంగా ప్రేమికుల రోజు సందర్భంగా విడుదల చేయాలనీ మేకర్స్ నిర్ణయించిన సాంగ్ ను అంతకంటే ముందే రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఈ సంఘటనను మరవక ముందే ‘భీమ్లా నాయక్’కు లీక్ ఇబ్బందులు ఎదురయ్యాయి. Read Also : Ram : భారీ రెమ్యూనరేషన్ కు…
టాలీవుడ్ లో ప్రస్తుతం ప్రముఖ నిర్మాతల్లో ఒకరిగా కొనసాగుతున్నారు సూర్యదేవర నాగవంశీ. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై హిట్ సినిమాలను నిర్మించి ప్రేక్షకుల హృదయాలలో స్తానం సంపాదించుకున్నారు. ప్రస్తుతం సూర్యదేవర నాగవంశీ చేతిలో సుమారు నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి భీమ్లా నాయక్. ఈ సినిమాను రిలీజ్ చేయడానికి నాగవంశీ ఎంతగానో ప్రయత్నించారు. ఎవరు ఆపినా ‘భీమ్లా నాయక్’ ఆగదని, తమ సినిమాపై తమకు నమ్మకం ఉందంటూ చెప్పిన నాగవంశీ.. పవన్ కళ్యాణ్ చెప్పడంతో…
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక మొదటి పోస్టర్ తోనే ఆసక్తిరేపిన ఈ సినిమా టైటిల్ టీజర్ ని మేకర్స్ సంక్రాంతి పండగ సందర్భంగా రివీల్ చేశారు. ‘అనగనగా ఒక రాజు’ అనే టైటిల్ ని ఖరారు చేస్తూ రాజు ఇంట్రడక్షన్ చూపించారు. రాజు…
2020లో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల నుంచి ‘ఉప్పెన’లాంటి అభిమానాన్ని రాబట్టుకున్న మెగా హీరో వైష్ణవ్ తేజ్. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ హీరో. వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోల్లో వైష్ణవ్ తేజ్ ఒకరు. ఈ యంగ్ హీరో ప్రస్తుతం తమిళ దర్శకుడు గిరీశయ్య దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర…
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగులోనూ సుపరిచితుడే . అయన నటించిన తమిళ్ సినిమాలు తెలుగులో డబ్ అవుతాయి. ఇప్పటివరకు టాలీవుడ్ లో స్ట్రైట్ ఫిల్మ్ లో నటించని ధనుష్ తాజాగా తన స్ట్రైట్ ఫిల్మ్ ప్రకటించేశాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణంలో చిత్రంతో తన డైరెక్ట్ తెలుగు సినిమా చేయనున్నట్లు ప్రకటించాడు. ఈ సినిమాకు ‘తొలిప్రేమ’ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తుండగా.. సూర్యదేవర నవ వంశీ నిర్మాతగా వ్యవహరించనున్నారు.…