Teaser gift to fans on the occasion of Dhanush’s birthday!
తమిళ స్టార్ హీరో ధనుష్ ఇప్పుడు తెలుగులోనూ స్ట్రయిట్ మూవీస్ చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు ధనుష్ తో తెలుగు, తమిళ భాషల్లో ‘సార్’ మూవీని నిర్మిస్తున్నాయి. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ నెల 27న విడుదల చేయబోతున్నారు. అలానే ధనుష్ పుట్టిన రోజును పురస్కరించుకుని మూవీ టీజర్ ను 28న రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాతలు నాగవంశీ, సాయి సౌజన్య తెలిపారు. ‘యాన్ యాంబిషియస్ జర్నీ ఆఫ్ ఎ కామన్ మ్యాన్’ అనేది ఈ మూవీ థీమ్. మలయాళీ ముద్దుగుమ్మ, ‘భీమ్లా నాయక్’ ఫేమ్ సంయుక్తా మీనన్ ఇందులో కథానాయికగా నటిస్తోంది. సినిమాటోగ్రాఫర్ దినేష్ కృష్ణన్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలి ఈ చిత్రానికి పని చేస్తున్నారు. హృదయాన్ని హత్తుకొనే సంగీతం సమకూర్చడంలో దిట్ట అయిన జి. వి. ప్రకాష్‌కుమార్ స్వరాలు సమకూర్చుతున్నారు.
Get ready to welcome our @dhanushkraja in & as #Vaathi / #SIR 📕
First Look on July 27 & Teaser on July 28!✨#VaathiFirstLook #VaathiTeaser #SIRFirstLook #SIRTeaser @iamsamyuktha_ #VenkyAtluri @gvprakash @dopyuvraj @NavinNooli #SaiSoujanya #SrikaraStudios @SitharaEnts pic.twitter.com/4a6cc5rhzI
— Naga Vamsi (@vamsi84) July 25, 2022