Swathi Muthyam Trailer Out: గణేష్ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలసి సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘స్వాతిముత్యం’. వర్ష బొల్లమ్మ ఈ చిత్ర కధానాయిక. లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ వినోద భరిత కుటుంబ కథా చిత్రం విజయ దశమి కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గణేష్, వర్ష బొల్లమ్మ, నిర్మాత నాగ వంశీ, దర్శకుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. సహజత్వంతో సున్నితమైన వినోదాన్ని పంచేలా ఉంది ఈ ట్రైలర్. హీరోయిన్ తో తొలి చూపులోనే హీరో ప్రేమలో పడటం, ఆమె కూడా తనని తిరిగి ప్రేమించడం వంటి సన్నివేశాలతో సాగుతుండగా ఊహించని సమస్య రావటం… ఆ వచ్చిన సమస్య ఏంటి? దాని నుండి బయట పడటానికి ఏం చేశారు? వంటి సన్నివేశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ఈ ట్రైలర్ లో సహజసిద్ధంగా ఉండే సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి.
ఈ సందర్భంగా దర్శకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ ‘సినిమాలో కొత్త పాయింట్ ఉంది. చిన్న టౌన్ లో గవర్నమెంట్ జాబ్ వచ్చిన వెంటనే ఓ అబ్బాయికి ఫ్యామిలీ మెంబెర్స్ పెళ్లి చేసే విధానం, తద్వారా ఆ అబ్బాయికి వచ్చే సమస్య చూపించబోతున్నాం. దానిని ఆ అబ్బాయి ఎలా ఫేస్ చేస్తాడు? చుట్టూ ఉండేవారు ఆ ప్రాబ్లెమ్ కి ఎలా రియాక్ట్అవుతారు? ఇలా ఆసక్తికరంగా ఉంటుంది. నిర్మాత వంశీ స్క్రిప్ట్ ని చాలా నమ్మారు. మహతి స్వర సాగర్ చాలా మంచి సంగీతం ఇచ్చాడు’ అని అన్నారు. వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ ‘గణేష్ కిది మొదటి సినిమా అయినా చాలా అద్భుతంగా చేశాడు. ఆయన క్రమశిక్షణ, సెట్స్ నడుచుకునే విధానం చాలా బాగుంది. గణేష్ కష్టానికి తగ్గ ఫలితం వస్తుందని ఆశిస్తున్నాను. అలాగే ఈ సినిమా కూడా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్న’ అని చెప్పారు. బెల్లంకొండ గణేష్ మాట్లాడుతూ ‘కథ వినగానే క్షణం కూడా ఆలోచించకుండా సితార వారు ఒప్పుకున్నారు. ట్రైలర్ లో చూసినట్టుగానే సినిమా సరదాగా మన ఇంట్లోనో, పక్కింట్లోనో జరిగే కథ లాగా ఉంటుంది. వర్ష సెట్ లో సపోర్ట్ గా నిలిచింది’ అన్నారు. ఈ చిత్రంలో ఇతరపాత్రల్లో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, సప్తగిరి, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద నటిస్తున్నారు.
Rajastan Political Crisis: కాంగ్రెస్ అధ్యక్ష బరిలో నామినేషన్ దాఖలుకు గెహ్లాట్ దూరం