రోడ్డు ప్రమాదాలు కామన్ అయిపోయాయి. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించడం విషాదం నింపింది. ఘన్‌పూర్(ఎం) వద్ద ఆర్టీసీ బస్సు కారును ఢీ కొట్టిన ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సాయంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సిరిసిల్ల వైపు నుంచి కరీంనగర్-1 డిపో బస్సు కామారెడ్డికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జయింది. ప్రమాదం కారణంగా…
తెలంగాణలో కరోనా వీరవిహారం చేస్తోంది. సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయములో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి కేటీఆర్. జిల్లాలో కరోన థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు కావలసిన ఏర్పాట్లు చేశాం అన్నారు. ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉన్నాయి. కష్టకాలములో అవసరమైతే కావలసిన సిబ్బందిని నియమించుకునే వెసులుబాటు స్థానిక అధికారులకు కల్పించాము. వాక్సినేషన్లో రాష్ట్రములోనే జిల్లా ఐదవ స్థానములో ఉంది. జిల్లాలో నాలుగు వందల డెబ్బైతొమ్మిది వైద్య బృందాలు లక్షా యాభై వేల ఇండ్లు ఫీవర్ సర్వే చేస్తున్నాయన్నారు.…
భారతీయ మహిళలు చీరలు ధరిస్తారు. ప్రతి చీరలో ఏదో ఒక ప్రత్యేకత వుంటుంది. అద్భుతమైన నేత సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ అగ్గిపెట్టెలో పట్టే చీరని సిరిసిల్లకు చెందిన యువ నేతన్న నల్ల విజయ్ నేశారు. హైదరాబాద్లో మంత్రులు కె.తారకరామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో దాన్ని తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రదర్శించారు. విజయ్ నేసిన ఈ అద్భుతమైన చీరకు మంత్రులు ప్రశంసలు కురిపించారు. ఈ చీరకు సంబంధించిన నేత ప్రక్రియను, ఇతర…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడు పెంచారు. వరుసగా జిల్లాల పర్యటన చేస్తున్న సీఎం కేసీఆర్…. ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 4న సిరిసిల్లకు రానున్నారు సీఎం కేసీఆర్. ఈ పర్యటనలో సిరిసిల్ల నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు ఇవ్వనున్న కేసీఆర్…. సిరిసిల్ల నూతన కలెక్టరేట్, నర్సింగ్ కళాశాలను ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే ఏర్పాట్లు మొదలు పెట్టింది జిల్లా అధికార యంత్రాంగం. కాగా..మాజీ మంత్రి ఈటెల…
తెలంగాణలో పార్టీ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు వైఎస్ షర్మిల.. ఇప్పటికే వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘంలో కూడా రిజిస్ట్రర్ చేశారు.. వచ్చే నెలలో పార్టీ జెండా, అజెండా ప్రకటించనున్నారు. వచ్చే నెలలోనే పార్టీ ఏర్పాటు చేయనున్నారు షర్మిల. అయితే.. ప్రజలకు దగ్గర కావాలనే నేపథ్యంలో వరుసగా జిల్లాల పర్యటనలు షర్మిల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఇవాళ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి.. కేటీఆర్ ఇలాకా అయిన రాజన్న సిరిసిల్లాలో…
కేటీఆర్ సిరిసిల్లకు ఎమ్మెల్యే కావడం ఆ ప్రజల అదృష్టమని తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి కేటీఆర్ తో పాటు మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇవాళ సిరిసిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ పేదల కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి సీఎం కెసిఆర్ అని.. ఎవ్వరూ సాహసం చేయని కార్యక్రమాలు సీఎం కెసిఆర్ చేస్తున్నారని కొనియాడారు. పక్క రాష్ట్రల ముఖ్యమంత్రులు సైతం కెసిఆర్ నిర్ణయాలతో ఆశ్చర్య పోతారని.. ముఖ్యమంత్రి…
కరోనా వైరస్ మన దేశంలో విలయం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి కారణంగా చాలా మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు, అధికారులు, మృతి చెందుతున్నారు. అయితే ఇటీవల సిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్ అంజయ్య కరోనాతో మృతి చెందారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్.. తన మంచి మనసును చాటుకున్నారు. కరోనాతో మరణించిన సిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్ అంజయ్య కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈరోజు అంజయ్య కుటుంబం…