అగ్గిపెట్టెలో పట్టే చీర .. నేత కార్మికునికి మంత్రుల అభినందనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ మహిళలు చీరలు ధరిస్తారు. ప్రతి చీరలో ఏదో ఒక ప్రత్యేకత వుంటుంది. అద్భుతమైన నేత సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ అగ్గిపెట్టెలో పట్టే చీరని సిరిసిల్లకు చెందిన యువ నేతన్న నల్ల విజయ్ నేశారు. హైదరాబాద్లో మంత్రులు కె.తారకరామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో దాన్ని తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రదర్శించారు. విజయ్ నేసిన ఈ అద్భుతమైన చీరకు మంత్రులు ప్రశంసలు కురిపించారు. ఈ చీరకు సంబంధించిన నేత ప్రక్రియను, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అగ్గిపెట్టెలో పట్టే చీర గురించి వినడమే కానీ తొలిసారి చూస్తున్నామని… ఇంత అద్భుతమైన చీర వేసిన విజయ్ ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేకంగా ప్రశంసించారు. తాను నేసిన ఈ చీరని మంత్రి సబితా ఇంద్రారెడ్డికి విజయ్ అందించారు. ప్రభుత్వ కార్యక్రమాలతో సిరిసిల్లలోని నేత రంగంలో ఇప్పటికే రంగంలో అనేక మార్పులు వచ్చాయని, సిరిసిల్ల నేతన్నలు ఆధునికమైన మరమగ్గాల వైపు, ఆధునిక పద్ధతుల వైపు వెళ్తున్నారని విజయ్ మంత్రులకు తెలిపారు.
Also Read
- Tarique Rahman: నవంబర్‌లో భారత్‌కు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్? ఢిల్లీతో చర్చలు షురూ!
- Gurugram: వామ్మో ఇదేం జాడ్యం.. హిట్ అండ్ రన్ కేసులో నిందితుడికి మద్దతుగా కార్ల ర్యాలీ
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?

ప్రస్తుతం తాను వేసిన సైతం చీర మూడు రోజులు మరమగ్గాల పై నేసే అవకాశం ఉంటుందని… అదే చీర చేతితో వేయాలంటే రెండు వారాల సమయం పడుతుందని ఈ సందర్భంగా తెలిపారు.
విజయ్ అద్భుత ప్రతిభను, విలక్షణమయిన ప్రయత్నాన్ని అభినందించిన మంత్రులు ఆయన చేసే భవిష్యత్తు ప్రయత్నాలకు సంపూర్ణంగా సహకారం అందిస్తామని తెలిపారు. ఈ మేరకు త్వరలోనే తాను ప్రారంభించబోయే యూనిట్ ప్రారంభోత్సవానికి రావాలని మంత్రి కేటీఆర్ ను విజయ్ ఆహ్వానించారు. ప్రారంభోత్సవానికి రావడంతోపాటు విజయ్ ప్రయత్నాలకు అన్నిరకాలుగా సహకారం అందిస్తానని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
UPI Payments: పెట్రోల్ బంకుల్లో యూపీఐ పేమెంట్స్ బంద్..? డీలర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం..
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. నందిగ్రామ్ పోటీ నుంచి అభ్యర్థి విత్‌డ్రా..
-
Danam Nagender : దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టిన హైకోర్టు
-
Nani: నా సినిమాలకు ఆ ట్యాగ్ వద్దు.. కుండబద్దలు కొట్టిన న్యాచురల్ స్టార్!
-
Uttam Kumar Reddy : తెలంగాణలో నీటి కొరత.. రైతులకు ఉత్తమ్ కీలక హామీ
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..