Road Accident: మాచారెడ్డిలో రోడ్డు ప్రమాదం..ఐదుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోడ్డు ప్రమాదాలు కామన్ అయిపోయాయి. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించడం విషాదం నింపింది. ఘన్పూర్(ఎం) వద్ద ఆర్టీసీ బస్సు కారును ఢీ కొట్టిన ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సాయంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సిరిసిల్ల వైపు నుంచి కరీంనగర్-1 డిపో బస్సు కామారెడ్డికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జయింది. ప్రమాదం కారణంగా కారులో చిక్కుకున్న మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ఒక బాలుడు ఉన్నారు. మరో బాలిక తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. బస్సు టైరు పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్య కేసులో ట్విస్ట్.. మొదటి ప్లాన్ హత్య కాదట.!
- Tripura DGP Anurag Dhankar: పోలీసు శాఖలో తీవ్ర విషాదం.. డీజీపీ అనురాగ్ ధన్‌ఖడ్ ఆత్మహత్య!
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!