కేటీఆర్ సిరిసిల్లకు ఎమ్మెల్యే కావడం ఆ ప్రజల అదృష్టమని తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి కేటీఆర్ తో పాటు మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇవాళ సిరిసిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ పేదల కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి సీఎం కెసిఆర్ అని.. ఎవ్వరూ సాహసం చేయని కార్యక్రమాలు సీఎం కెసిఆర్ చేస్తున్నారని కొనియాడారు. పక్క రాష్ట్రల ముఖ్యమంత్రులు సైతం కెసిఆర్ నిర్ణయాలతో ఆశ్చర్య పోతారని.. ముఖ్యమంత్రి అయిన మొదటి ఏడాదే డబుల్ బెడ్ రూం ప్లాన్ వేయించాడని పేర్కొన్నారు. రాష్ట్రంలో 19 వేల కోట్ల రూపాయలతో 2 లక్షల 67 వేల ఇళ్లు కట్ట బోతున్నామని తెలిపారు. దేశంలో నెంబర్ 1 మంత్రి.. కేటీఆర్ అని.. ఇప్పటి వరకు 1.67 లక్షల ఇళ్లు పూర్తయ్యాయని వెల్లడించారు. ప్రపంచంలో పెద్ద, పెద్ద కంపెనీలు మంత్రి కేటీఆర్ చొరవతో హైద్రాబాద్ కు వస్తున్నాయన్నారు. 19వేల ఎకరాల్లో ఫార్మా హబ్ ను ఏర్పాటు చేయబోతున్నామని.. రానున్న రోజుల్లో ఉద్యోగాలు 5 లక్షల మందికి రాబోతున్నాయని హామీ ఇచ్చారు.