తెలుగు పాపులర్ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ వార్తతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. హైదరాబాద్‌లోని నిజాంపేటలో వర్టెక్స్ ప్రీ విలేజ్ గేటెడ్ కమ్యూనిటీలో ఈ ఘటన జరిగింది. ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని అందరూ భావిస్తుండగా.. తాజాగా ఆమె కుమార్తె సంచలన వ్యాఖ్యలు దయ ప్రసాద్ చేసింది. తన తల్లి కల్పన ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టి పారేసింది.
టాలీవుడ్ సీనియర్ సింగర్ కల్పన నిద్ర మాత్రలు మింగి ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. అసలు ఒక స్టార్ సింగర్ ఇలా సడెన్ గా ఎందుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని అందరూ ఆశ్చర్య పోయారు. తాజాగా కేపీహెచ్బీ పోలీసులు కల్పనా స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. కేపీహెచ్‌బీ పీఎస్ కి చెందిన మహిళా ఎస్సైతో పాటు మరో ఎస్‌ఐ ఆస్పత్రికి వచ్చి స్టేట్‌మెంట్ తీసుకున్నారు. కల్పన సంచనల విషయాలు వెల్లడించింది.
ప్రముఖ పాపులర్ తెలుగు సింగర్ కల్పనకు సంబంధించి హెల్త్ అప్‌డేట్‌ను నిజాంపేట హోలిస్టిక్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ప్రాణానికి ఎలాంటి ప్రాణ హాని లేదని చెప్పారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.
ప్రముఖ పాపులర్ తెలుగు సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం వ్యవహారం అభిమానులను ఉలిక్కిపడేలా చేసింది. హైదరాబాద్‌లోని నిజాంపేటలో ఆమె నివాసంలో ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. రెండు రోజుల నుంచి ఉలుకుపలుకు లేకపోవడంతో అపార్ట్‌మెంట్ వాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేపీహెచ్‌బీ పోలీసులు వచ్చి తలుపులు బద్ధలు గొట్టి లోపలికి వెళ్లారు.