Union Minister Prahlad Joshi Clarity in Parliament on Privatization of Singareni: సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణపై కేంద్రప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీలు అడిగిన ప్రశ్నకు బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సమాధానం ఇచ్చారు. బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని కేంద్రం స్పష్టం చేసింది. బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం కేంద్రానికి లేదని తెలిపారు. సింగరేణిలో 51 శాతం తెలంగాణ ప్రభుత్వానికే వాటా ఉందని..…
గోదావరి వరద ప్రవాహంతో ఇంటెక్ వెల్ లో చిక్కకున్న తమ ఆర్తనాదాలు పట్టించుకోవాలని కార్మికులు కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం గోదావరినది ఇంటెక్ వెల్ల లో చిక్కకున్న ఏడుగురు తమను కాపాడాలంటూ వేడుకుంటున్నారు. సింగరేని సంస్థకు చెందిన ఐదుగురు ఉద్యోగులు బుధవారం (నిన్న) ఉదయం ఇంటెక్ వెల్ వద్ద విధులు నిర్వహించేందుకు వెళ్లిన విషయం తెలిసిందే.. అయితే ఈ క్రమమంలో గోదావరి ఉధృతి పెరగడంతో.. ఐదుగురు సింగరేణి కార్మికులు అక్కడే ఉండిపోయారు. అయితే వారిని కాపాడేందుకు వెళ్లిన…
దుర్గం చిన్నయ్య. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే. సింగరేణి పట్టాల పంపిణీ ఆయనకు నిద్ర లేకుండా చేస్తోందట. ఈ అంశంలో ఇన్నాళ్లూ అదిగో ఇదిగో అని ప్రచారం ఊదరగొట్టింది ఆయనే. జిల్లాలోని మిగిలిన రెండు నియోజకవర్గాల్లో అక్కడి శాసనసభ్యులు పట్టాల పంపిణీ జోరు పెంచితే.. బెల్లంపల్లిలో ఎక్కడో బెడిసి కొట్టిందట. అందుకే తెగ ఆందోళన చెందుతున్నారట ఎమ్మెల్యే చిన్నయ్య. సింగరేణిలో పనిచేసి అక్కడే తమ నివాసం ఏర్పాటు చేసుకున్న రిటైర్డ్ కార్మికులు.. స్థానికులకు సైతం పట్టాలు అందజేస్తున్నారు.…
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నిన్న బుధవారం జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అయితే.. ఆదిలాబాద్, కుమ్రంభీ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. నేడు గురువారం ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో…
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆపారమైన సహజ సంపదకు కేరాఫ్ గా మహదేవపూర్ ప్రాంతం నిలుస్తుందని చెప్పడంలో అతియోశక్తి లేదు. టేకు కలప, ఇసుక ఇప్పటికే ఉండగా బొగ్గు నిక్షేపాలతో మరోమారు దేశం దృష్టిని ఆకర్షించనుంది. మహదేవపూర్ లో ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రపంచ స్థాయి గుర్తింపు రాగా చండ్రుపల్లిలో బొగ్గు నిక్షేపాలు జాడలు బయటపడటంతో మరోసారి ఆ ప్రాంతంపై అందరి దృష్టి పడింది. రెండేళ్ల కిందట రైతు జాడి సురేందర్ తన పొలంలో వ్యవసాయానికి ప్రైవేటు వాహనంతో…
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లోని సింగరేణి నిర్వాశిత గ్రామం లద్నాపూర్ గ్రామస్తులు నెల రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు..గ్రామంలో ఉన్న 283 మంది భూ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడంతో నిర్వాసితులు నిరసన బాట పట్టారు. ఓసీపీ 2 విస్తరణలో భాగంగా గ్రామాన్ని బలవంతంగా ఖాళీ చేయించాలని చూస్తే ఉరుకోబోమని హెచ్చరిస్తున్నారు.. సింగరేణి భూనిర్వాసిత గ్రామం లద్నపూర్ లో నిర్వాసితులకు సింగరేణి అధికారులకు మధ్య గొడవ కంటిన్యూ అవుతుంది..సింగరేణి అధికారులు…
ఆర్టీసీ నష్టాల్లో ఉంటే తెలంగాణ ప్రభుత్వం రూ. 1000 కోట్లు ఖర్చు పెట్టి కాపాడుకుంటోందని అన్నారు ఎమ్మెల్సీ కవిత. సింగరేణి చెమట చుక్క విలువ తెలియని ప్రభుత్వం ఎక్కువ రోజులు మనుగడ సాధించదని అన్నారు. కేంద్రం మాత్రం ఉన్న సంస్థల్ని అమ్ముకుంటోందని.. కార్మికులకు లాభం చేకూర్చే 40 చట్టాలను తీసేసి కేవలం నాలుగు కార్మిక చట్టాలను తెచ్చారని విమర్శించారు. కార్మికుల హక్కులను హరించే ఈ నాలుగు చట్టాలను తీసేసే వరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్లకు బీజేపీ…