మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే భారీ బహిరంగ సభకు లక్షకు పైగా మంది వస్తారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. మంచిర్యాల నియోజక వర్గంలో భారీ బహిరంగ సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తారన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేక సమస్య లు ఉన్నాయి.. ఫారెస్ట్ రైట్ యాక్ట్ ఇక్కడ లేదు.. ఎవ్వరికి భూమి పై హక్కులు లేకుండా చేసారు.. ప్రాణ హిత ప్రాణం తీశారు.. ఇక్కడి ఇసుకను ప్రభుత్వ పెద్దలు దోపిడి చేస్తున్నారు అని భట్టి విక్రమార్క విమర్శించారు.
Read Also : Amit Shah: 2024లో బీజేపీదే అధికారం.. 300కు పైగా లోక్‌సభ స్థానాలు గెలుస్తాం..
సింగరేణిని ప్రైవేట్ పరం చేసే దుర్మార్గపు కుట్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. స్టీల్ ప్లాంట్ పెట్టే శక్తి ఉంటే బయ్యారంలో పెట్టు.. విశాఖ వద్దు బయ్యారం ముద్దు అని ఆయన అన్నారు. ఇక్కడ అమ్మకానికి పెడతావ్ విశాఖ స్టీల్ ప్లాంట్ తీసుకుంటావా.. సమస్యలను పక్క దోవ పట్టించడం కోసమే ఇదంతా కేసీఆర్ చేస్తున్నాడని భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ఓడిపోతామనే భయం తో సింగరేణిలో ఎన్నికలు నిర్వహించడం లేదు అని భట్టి అన్నారు. ధరణితో భూమిపై హక్కులు లేకుండా చేశారని భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి గనులను ప్రైవేట్ పరం చేస్తున్నారని తెలిపాడు. సింగరేణిలో ఉద్యోగాలు పోతున్నాయని భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సహజవనరులు కాపాడి.. స్థానికులకే ఉద్యోగాలిస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హామి ఇచ్చారు.
Read Also : TSPSC Paper Leak: పేపర్ లీకేజ్ పై సిట్ కు ఈడీ లేఖ