Singareni: బొగ్గు బావులను ప్రయివేటు పరం చేస్తే ఊరుకోబోమని, కేంద్రంపై జంగ్‌సైరన్ మోగిస్తామని సింగరేణి కార్మికులు భగ్గుమంటున్నారు. సింగరేణిని ప్రైవేటీకరించబోమని తెలంగాణ ప్రజల సాక్షిగా చెప్పిన ప్రధాని మోడీ… కేంద్ర ప్రభుత్వానికి హటావో సింగరేణి బచావో నినాదం వినిపించేలా మహాధర్నా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణి బ్లాకులను ప్రయివేటుకు అప్పగించాలన్న కేంద్రం యోచనపై కార్మికులు భగ్గుమంటున్నారు. తెలంగాణకు జీవనాడి అయిన సింగరేణిని తొలగిస్తే శాంతి ఉండదని హెచ్చరిస్తున్నారు. లాభాల్లో ఉన్న కంపెనీని నిర్వీర్యం చేస్తే సహించేది లేదని స్పష్టం చేస్తున్నారు. కేంద్రం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వానికి బొగ్గు బ్లాకులను కేటాయించాలని డిమాండ్ చేశారు. బొగ్గు బావుల ప్రైవేటీకరణ తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారిందని మూడు కోట్ల మంది తెలంగాణ ప్రజల గొంతు నొక్కేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తుంటే సింగరేణి మహాధర్నాతో సింగరేణిని ఆదుకుంటామన్నారు.
Read also: Sharad Pawar: అదాని, అంబానీలపై దాడి చేయడం కరెక్ట్ కాదు
ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ తాతా మధు, టీబీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావు, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వర్ రావు, సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ సింగరేణి కార్మికులు, బీఆర్‌ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు మహాధర్నాకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. సింగరేణి బ్లాకులను ప్రయివేటుకు అప్పగించాలనే కేంద్రం యోచనలో తెలంగాణకు జీవనాడి అయిన సింగరేణిని దూరం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. లాభాల్లో ఉన్న కంపెనీని నిర్వీర్యం చేస్తే సహించేది లేదని, కేంద్రం ప్రైవేటీకరించడం లేదని చెబుతూనే సింగరేణి బొగ్గు బావులను వేలం వేయాలనే నిర్ణయం ఏంటని ప్రశ్నించారు. ప్రైవేటీకరణ చేస్తే ఎంతో మంది కార్మికుల జీవితాలు నాశనమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల పక్షాన కేంద్రంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. నేటి మహాధర్నాను ఇల్లెందు, సత్తుపల్లి, కొత్తగూడెం, మణుగూరు ఏరియాల కార్మికులు, బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు విజయవంతం చేయాలని కోరారు. ఇటీవల రామగుండం ప్రాంతంలో ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ప్రధాని మోదీ.. సింగరేణిలో 51% వాటాలున్న తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి బావుల ప్రైవేటీకరణ ప్రసక్తి లేదన్నారు. తెలంగాణకు జీవనాడి అయిన సింగరేణిని దూరం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని, అందుకే బొగ్గు గనులను ప్రయివేటుకు అప్పగించేందుకు సిద్ధమైందని ఆరోపించారు. నల్లబంగారాన్ని ప్రయివేటుకు అప్పగిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
IPL2023 : సన్‌రైజర్స్ బ్యాటింగ్‌పై పేలుతున్న మీమ్స్