Today Stock Market Roundup: సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సంక్షోభ భయాలు ఇండియన్ స్టాక్ మార్కెట్‌ని ఇంకా వీడలేదు. దీంతో ఇవాళ మంగళవారం కూడా నిన్నటి మాదిరి పరిణామాలే చోటుచేసుకున్నాయి. రెండు కీలక సూచీలు ఉదయం లాభాలతో ప్రారంభమైనప్పటికీ ఇంట్రాడేలో ఆ పరిస్థితి కొనసాగలేదు. ఐటీ, ఆటోమొబైల్, పవర్, రియాల్టీ కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి.
Today(13-03-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారం ట్రేడింగ్‌ని శుభారంభం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇవాళ సోమవారం ఉదయం రెండు కీలక సూచీలు లాభాలతో మొదలయ్యాయి. కానీ.. ఇంట్రాడేలో ఆ ట్రెండ్‌ని కొనసాగించలేకపోయాయి. దీంతో.. సాయంత్రం భారీ నష్టాలతో ముగిశాయి. ఈ ఏడాది కనిష్ట విలువలను నమోదు చేశాయి. వివిధ రంగాల్లోని కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తడికి గురయ్యాయి.
Business Headlines 11-03-23: కొత్త అధిపతి రోహిత్ జవా: హిందుస్తాన్ యూనిలీవర్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా రోహిత్ జవా నియమితులయ్యారు. సంజీవ్ మెహతా రిటైర్ కానుండటంతో ఆయన స్థానంలో రోహిత్ జవా రానున్నారు. ఈయన ఇప్పుడు ఇదే సంస్థలో చీఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కొత్త పదవీ బాధ్యతలను ఈ ఏడాది జూన్ 27వ తేదీన చేపట్టి ఐదేళ్లపాటు కొనసాగుతారు. రోహిత్ జవా నియామకానికి స్టాక్ హొల్డర్ల అంగీకారం పొందాల్సి…